సంపాదకీయం

ప్రభుత్వేతర విన్యాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థికనీతిని జ నం మెచ్చుకోవాలని భావించేలోగా నొచ్చుకు నే కార్యక్రమాలను కూడ ప్రభుత్వం వారు ఉద్ఘోస్తున్నారు! రక్షణ, విదేశాంగ రంగాలలో గత ప్రభుత్వం వారి మెతక విధానాలకు పూర్తి భిన్నంగా విప్లవాత్మకమైన కరకుతనాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రస్ఫుటింపచేస్తోంది. గంగా ప్రక్షాళన, గోరక్ష, యోగా, భారత్‌లో నిర్మించడం, కాలుష్యరహిత సమాజం-వంటి కార్యక్రమాలను జనం మెచ్చుకోవాలని భావిస్తున్నారు. కానీ ‘ప్రపంచీకరణ’, స్వేచ్ఛా వాణిజ్యం, విదేశీయ సంస్థల పెట్టుబడులు, కేంద్రీకరణ- వంటి మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వం నాటి ‘దివాలాకోరు’ ఆర్థికనీతిని మరింత ‘నిష్ఠ’తో మోదీ ప్రభుత్వం అమలు జరుపుతుండడమే జనానికి నచ్చని దుష్ఫరిణామం! జాతీయతావాదులు, స్వదేశీయ ఆర్థిక నీతిని కోరుతున్న సంస్థలు పదే పదే వ్యతిరేకిస్తున్నప్పటికీ విదేశీయ సంస్థలు రక్షణోత్పత్తుల రంగంలోకి చొరబడిపోవడానికి ప్రభుత్వం తలుపులను ‘పగలగొట్టి’ వేస్తోంది! ప్రభుత్వరంగ వాణిజ్య సంస్థలు ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలతో పోటీపడే విధంగా ప్రభుత్వం సంస్కరణలను అమలు జరిపినట్టయితే జనం మెచ్చుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థలను క్రమంగా ప్రభుత్వేతర సం స్థలకు అప్పగించేయడం జనం మెచ్చని విపరిణామం! ‘ఎయిర్ ఇండియా’ అన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థను ప్రభుత్వేతర సంస్థలకు అమ్మివేయడానికి ప్రభుత్వం ఇప్పుడు గట్టిగా నడుం బిగిస్తోంది! ప్రభుత్వేతర సంస్థల విమానాలలో ప్రస్తుతం ఎనబయి ఆరు శాతం ప్రయాణీకులు పయనిస్తున్నార ట! ఎనబయి ఆరు ప్రభుత్వేతర విమానాలు ఆకాశంలో ఎ గురుతున్నప్పుడు మి గిలిన పదునాలుగు విమానాలు మాత్రం ప్రభుత్వ రంగంలో ఎందుకుండాలి? మొ త్తం వందశాతం విమానాలు ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలవే ఎందుకు కారాదు? ‘ఎగురుతున్న విమానాలు మొత్తం ప్రభుత్వేతర సంస్థలవే కావడం’ ఆర్థికమంత్రి కలలు కంటున్న ఆదర్శ స్థితి. ఈ ప్రభుత్వేతర స్వప్నాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మే నెల ఇరవై ఏడవ తేదీన ఆవిష్కరించాడు...
ప్రాంతీయ అనుసంధానం-రీజినల్ కనెక్టివిటీ- పేరుతో చిన్న నగరాలకు, పట్టణాలకు విమానయాన సేవలను ప్రారంభించిన ప్రభుత్వం గంట ప్రయాణానికి రెండు వేల ఐదు వందల రూపాయల కంటే మించి ప్రయాణ శుల్కం విధించరాదని నిబంధనను విధించింది. జనం మెచ్చిన పథకాలు ఇవి! మొత్తం వంద శాతం విమాన సేవలు ప్రభుత్వేతర సంస్థలకు దక్కిపోయినట్టయితే ఈ పథకాలు అమలు జరుగుతాయా? ప్రభుత్వేతర సంస్థలు లాభసాటి కాని, పోటీ పద్ధతిలో ప్రయాణీకులను దోపిడీ చేయడానికి వీలు లేని మార్గాలలో చిన్న నగరాలకు, పట్టణాలకు విమానాలు నడుపుతాయా? ‘రీజినల్ కనెక్టివిటీ’ పథకం కింద నడిపే విమానాల సేవలు పెద్ద లాభసాటి కాదు. ఈ ‘లోటు’ను పూడ్చుకొనడానికి వీలుగా ప్రధాన మార్గాలలో ‘ఎగిరే’ పెద్ద విమానాలలో అదనపు శుల్కాలను వసూలు చేయాలన్న ప్రతిపాదనను గత ఏడాది ప్రభుత్వం చేసింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వేతర విమాన సంస్థల వారు వ్యతిరేకించారట! ప్రజా సంక్షేమం, వ్యాపారుల లాభం-ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడం ప్రభుత్వేతర సంస్థలకు గిట్టని వ్యవహారం!! ఎయిర్ ఇండియాను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించిన తరువాత ‘రీజినల్ కనెక్టివిటీ’ ఏమవుతుంది? ఆస్తుల అమ్మకాలు-డిస్‌ఇనె్వస్ట్‌మెంట్- పేరుతో ‘ఎయిర్ ఇండియా’లో ప్రభుత్వేతర సంస్థలకు భారీ భాగస్వామ్యం కల్పిస్తారా? లేక పూర్తిగా ప్రభుత్వేతరులకే ఈ విమానయాన సంస్థను అమ్మేస్తారా? విదేశీయ సంస్థలకు కట్టబెడతారా? అరుణ్ జైట్లీ చెప్పలేదు.
రక్షణ రంగంలో ‘స్వయం సమృద్ధి’ని సాధించడానికై ప్రభుత్వం స్వదేశీయ పరిజ్ఞానంతో సమీప, మధ్య దూర లక్ష్యచ్ఛేదక క్షిపణులను రూపొందిస్తోంది. ఆకాశ్, అగ్ని, పృథివి వంటి అత్యాధునిక శస్త్రాలు మున అమ్ములపొదిలో చేరుతున్నాయి! విదేశాల నుంచి రక్షణ పరికరాల దిగుమతులు ఆగలేదు. అరవయి ఐదు శాతం సమర శకటాలు, ఆయుధాలు ఇప్పటికీ మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నాము. ఈ దుస్థితి తొలగిపోవాలంటే ఆయుధాలు, యుద్ధ వాహనాలు ఇతరేతర రక్షణ ‘ఉపకరణాలు’ దేశంలోనే తయారు కావడానికి ప్రభుత్వ విధానాలు దోహదం చేయాలి! చైనా మనకంటే దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఆధికారిక సైనిక వ్యయం చేస్తోంది. అనధికారికంగా మరిన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది! చైనా సమర సామగ్రిలో తొంబయి శాతానికి ఐగా ఆ దేశంలోనే తయారవుతోంది. మన ప్రభుత్వం దేశంలోనే దాదాపు లక్షా డెబ్బయి ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంలో నాలుగు రకాల రక్షణ సామగ్రిని తయారుచేస్తుందట! రక్షణశాఖ ఈ ప్రతిపాదనకు తుది రూపం ఇస్తోందట! యాబయి వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆరు జలాంతర్గాము లు, అరవై వేల కోట్ల రూపాయల ఖర్చుతో వందకు పైగా ‘ఆధునిక’ యుద్ధ విమానాలు, యాబయి వేల కోట్ల రూపాయల ఖ ర్చుతో సాయుధ యుద్ధ శకటాలు, పనె్నండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో నౌకాదళం ఉపయోగించే గగన శకటాలు-హెలికాప్టర్స్-దేశంలో రూపొందనున్నాయట! ‘్భరత్‌లో నిర్మించండి’ అన్న స్ఫూర్తికి ఇవన్నీ దోహదం చేయగలవు. ఈ రక్షణ ఉత్పత్తులన్నీ ప్రభుత్వేతర సంస్థలు రూపొందించనున్నాయట. అంతా బాగుంది! కానీ ఈ ప్రభుత్వేతర సంస్థలు ‘విదేశీయ సంస్థల’లలో అనుసంధాన పద్దతి ద్వారా రక్షణ ‘ఉపకరణాల’ను నిర్మిస్తాయట! అంటే విదేశీయ సంస్థలు ఎలాంటి పెట్టుబడులను పెట్టకుండానే మన రక్షణ రంగం ‘జట్టు’ను తమ కబంధ హస్తాలలో ఇరికించుకుంటాయి. ఇదీ మన ఆర్థిక నీతిలోని వైరుధ్యం...
ప్రభుత్వ రక్షణోత్పత్తుల రంగంలోని పరిశ్రమలు-ఆర్ట్‌నన్స్ ఫ్యాక్టరీస్- ఆశించిన స్థాయిలో పని చేయడం లేదన్నది ప్రభుత్వం నిర్ధారించిన మహా విషయం. వీటి పని తీరును మెరుగు పరచాలి. ఈ ఫ్యాక్టరీలను మూసివేయాలని లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తుల కోసం వీటిని ఉపయోగించుకోవాలని రక్షణోత్పత్తుల మంత్రిత్వ విభాగం నిర్ణయించినట్టు ప్రచారం అవుతోంది! ‘ప్రత్యామ్నాయ ఉత్పత్తులు..’ అంటే ఏమిటో మరి? ప్రభుత్వరంగ సంస్థలు తయారుచేయలేని రక్షణ ఉపకరణాలను ప్రభుత్వేతర సంస్థలు తయారు చేయగలవా? రక్షణ రంగంలో ప్రభుత్వేతర, విదేశీయ సంస్థల భాగస్వామ్యం పెరగడం వల్ల అవినీతి పుట్టలు పగలడం ఇటీవలి చరిత్ర..!