సంపాదకీయం

ఆవుల‘సంత’ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోసంతతి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు జరుపతలపెట్టిన నియమావళిని వ్య తిరేకిస్తున్నవారు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వి ఘాతం కలిగిస్తున్నారు. కొన్ని ప్రతిపక్షాలకు కేవలం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం ఏకైక కార్యక్రమం. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ దానిని ‘రాజ్యాంగ వ్యతిరేకమని’ చిత్రీకరించడం ఈ ‘కొన్ని’ ప్రతిపక్షాలకు విధానమైపోయింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులూ ‘సమాఖ్య తత్వం’-ఫెడరలిజమ్-నీరుగారిపోతోందని వాపోతున్నారు. కానీ ఆవులను, దూడలను, కోడెలను ఇతర పాడిపశువులను పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణంలో నిర్దేశించారు. అందువల్ల కేంద్రప్రభుత్వం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆవులను రక్షించి వాటి సంఖ్యను పెంచడానికి దోహదం చేయాలి. గోసంరక్షణ రాజ్యాంగ సూత్రానికి అనుగుణం, గోవధ ఈ సూత్రానికి వ్యతిరేకం. ఏడు దశాబ్దులుగా సంరక్షణ, సంరక్షణ ఉద్యమాలకు ప్రచారం లేదు. ఆవుమాంసం తినడం తమ హక్కు అన్న వారికి ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ‘ఆవును పూజించడం తమ హక్కు’ అని అంటున్నవారు దేశ జనాభాలో 85 శాతానికిపైగా ఉన్నారు. గోమాంస భక్షకుల సంఖ్య 4 శాతం మాత్రమేనని సర్వేలు ధ్రువపరిచాయి. ప్రభుత్వం ఎవరి హక్కులను రక్షించాలి? ప్రభుత్వం జారీ చేసిన నియమావళి అమలు జరుపకుండా మదరాసు ఉ న్నత న్యాయస్థానానికి చెందిన మధురై ధర్మాసనం మంగళవా రం తాత్కాలిక ఆదేశం- స్టే- జారీ చేయడం కేంద్రప్రభుత్వానికి ఎ దురుదెబ్బ అన్న గొ ప్ప ప్రచారం వెంటనే మొదలైంది. న్యాయస్థాన ధర్మాసనం వారు కేవలం తాత్కాలికంగా నియమావళి అమలు జరుపరాదని మాత్రమే నిర్దేశించారు. నియమావళి రాజ్యాంగ నిబద్ధతపై వ్యాఖ్యానించలేదు. ఇలా ‘స్టే’ ఇవ్వడం న్యాయప్రక్రియలో భాగం. ‘స్టే’ ఇచ్చినంత మాత్రాన నియమావళిని ఉన్నత న్యాయస్థానం రద్దు చేసినట్లు కాదు. నియమావళిని వ్యతిరేకిస్తూ దాఖలైన ‘యాచిక’- పిటిషన్‌కు సమాధానం చెప్పాలని న్యాయస్థానం కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అభిప్రాయాలను తెలుపవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ నియమావళిని రూపొందించినట్లు న్యాయస్థానంలో నిరూపించవచ్చు.
వధించడాని కోసం సంతలలో ఆవులను, గోసంతతిని అమ్మరాదని, కొనరాదని 26వ తేదీన జారీ చేసిన నియమావళిలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం పశువుల వాణిజ్యానే్న కేంద్రప్రభుత్వం నిషేధించినట్లు కేరళ ప్రభుత్వం ప్రచారం చేయడం వాస్తవానికి ఘోరమైన వక్రీకరణ. ఆవుల, ఎద్దుల వ్యాపారం పూర్తిగా రద్దయిపోయి వేలాది జనం ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోతారని కేరళ ప్రభుత్వం చెప్పడం రెచ్చగొట్టే చర్యలలో భాగం. అధికారగ్రస్తమైన తరువాత మతిమాలిన చర్యలకు పాల్పడుతున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కేంద్రప్రభుత్వ నియమావళి రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించడం మరో విచిత్రం. గోసంతతిని, పశు సంతతిని సంరక్షించాలని రాజ్యాంగంలోని నలబై ఎనిమిదవ అధికరణం నిర్దేశిస్తుండగా కేంద్రప్రభుత్వ చర్య రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అయింది? ఈ అధికరణం ‘మార్గదర్శక సూత్రం’ కావచ్చు. అందువల్ల రాజకీయ అవకాశవాదులైన ప్రభుత్వ నిర్వాహకులు ఈ మార్గదర్శక సూత్రాన్ని పాటించకపోయినప్పటికీ, పాటించి తీరాలని న్యాయస్థానాలు ఆదేశింపజాలవు. కానీ పాటించడం రాజ్యాంగ వ్యతిరేకం కాజాలదు. అందువల్ల కేంద్రప్రభుత్వ నియమావళి రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాఖ్యానించడం ఘోరమైన అనభిజ్ఞత-ఇగ్నోరెన్స్-కు సాక్ష్యం. కేంద్రప్రభుత్వం ఈ రాజ్యాంగ సూత్రాన్ని పాటించింది.
కేరళ ముఖ్యమంత్రి అంటున్నట్లుగా కేంద్రప్రభుత్వం రూపొందించిన నియమావళి వల్ల ఎవ్వరూ ఉపాధిని కోల్పోరు. గోసంరక్షణ వల్ల ఉపాధి ఉద్యోగాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. గోహంతకులకు మించిన సంఖ్యలో గోపాలకులకు ఉపాధి ఏర్పడుతుంది. వధించడం కోసం ఆవులను, ఎద్దులను అమ్మడం వల్ల లభించే ఆదాయం కంటె అవి సహజమరణం పొందేదాక పోషించడం వల్ల లభించే ఆదాయం ఇబ్బడిముబ్బడిగా ఉంటోంది. ఒక పాడి ఆవును పెంచడం వల్ల కోడెను పెంచడంవల్ల మాత్రమే లాభం చేకూరుతుందనుకోవడం వాస్తవంలో సగం మాత్రమే. వట్టిపోయిన, ఈతలుదిగిన ముసలి ఆవు -హీఫర్-ను ముసలి ఎద్దు- స్టీర్-ను పెంచడం వల్ల కూడా ఆర్థికంగా గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఇలాంటి ఒక్కొక్క ఆవువల్ల లభించే పేడ, మూత్రం రెండెకరాల భూమిని పం డించడానికి సరిపడా సహజమైన ఎరువును తయారు చే యడానికి ఉపకరిస్తాయి. శాస్తవ్రేత్తలు మాత్రమే కాదు రైతులు స్వానుభవంతో చెబుతున్న మాట ఇది. తరుణప్రాయం ఆవులవల్ల ఎద్దుల వల్ల పాలు, పెరుగు, నెయ్యి లభిస్తాయి, పొలాలు దు న్నవచ్చు. అనాదిగా ఈ దేశంలో పరిఢవిల్లిన దాదాపు రెండు వందల రకాల ఆవుల వల్ల, గోసంతతి వల్ల పొలాలు విరగపండాయి. భారతదేశం విశ్వజనాళికి ఆహారం ప్రదాత కావడం చరిత్ర. ఈ చరిత్రను అరబ్బు తురుష్క జిహాదీ బీభత్సకారులు, ఐరోపా నుంచి వచ్చిపడిన దురాక్రమణదారులు చెరచారు. ఆవులను చంపి తినేశారు. అంతకంటే వందరెట్లుగా గోమాంసాన్ని విదేశాలకు తరలించారు.
రెండు వందల జాతుల ఆవులలో కేవలం 29 జాతులు మాత్రమే మిగిలి ఉండటం వర్తమాన వాస్తవం. గోసంతతి అంతరించడం.. మన వ్యవసాయం పాడుపడటం.. తిండిగింజల కోసం 1960వ దశకం వరకు విదేశాల వద్ద బిచ్చమెత్తడం సమాంతర విపరిణామాలు. ఒకటి మరోదాన్ని సృష్టించింది. 1960 దశకం తరువాత సంకరజాతి పంటలవల్ల, రసాయనాలను వాడటం వల్ల తిండిగింజల కొరత ఏర్పడింది. కానీ విష రసాయనాల వల్ల వ్యవసాయ భూమి, భూగర్భ జలాలు, పరిసరాలు, ప్రకృతి కాలుష్యంతో నిండిపోయా యి. ఆవుపేడ, గోమూత్రం వంటి సహజ జీవామృతాలను వాడి సేద్యం చేయడం వల్ల మాత్రమే ‘స్వచ్ఛ్భారతం’ మళ్లీ ఏర్పడుతుంది. సంతలలో వధ కోసం కాక, పెంచుకోవడం కోసం గోసంతతిని కొ నుక్కోవడం మనదేశంలో జీవన వాస్తవం.