కరీంనగర్

వృత్తి, విద్య నిపుణుల భాగస్వామ్యంతో కాంగ్రెస్ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, జూలై 17: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వృత్తి విద్య నిపుణుల సహకారం ఎంతో అవసరమని ఆల్ ఇండియన్స్ ప్రొఫెసనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) అన్ని రాష్ట్రాల జాతీయ సదస్సులో రాహుల్ గాంధీ పిలుపునివ్వడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుద్ర సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ 2017లో ఏఐపీసీ తెలంగాణ విభాగం ప్రారంభమైందని, అతి తక్కువ కాలంలోనే వృత్తినిపుణుల నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో గెలుపొందేందుకు గాను వృత్తి విద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ పని చేస్తుందన్నారు. నేషనల్ చైర్మన్ శశితరూర్, డిప్యూటి చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవర, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, 70 మంది రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఏఐపీసీ కార్యదర్శి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాసన్, దాసోజు శ్రవణ్, కల్యాణ్‌ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ఆసంపల్లి గ్రామానికి చెందిన రుద్ర సంతోష్ కుమార్, ఏఐపీసీ సమావేశంలో పాల్గొనడం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.