ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయుర్వేద వైద్యంలో ఎనె్నన్నో అనారోగ్యాలకు పిప్పళ్ళను ఔషధంగా వాడుతారు. ఇవి రుచిపరంగా కారంగా, ఘాటుగా ఉన్నా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
- బాలింతరాలికి చనుబాలు వృద్ధి చెందాలంటే పిప్పళ్ళను తీసుకోవాలి.
- శిశువుకి పళ్ళు వచ్చేటప్పుడు పిప్పళ్ళ పొడిని తేనెలో కలిపి, చిగుళ్ళ మీద పలుచగా రాస్తూంటే దురదల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- కడుపులోని నులిపురుగులను నివారించేందుకు పిప్పళ్లను వాడాలి. ఇవి ఆకలిని వృద్ధి చేస్తాయి. వాతాన్ని హరిస్తాయి. పేగులు, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
- పిప్పళ్ళను వేయించి పొడి చేసి, సైంధవ లవణం కలిపి అన్నంలో తింటే స్థూలకాయాన్ని నివారించవచ్చు.
- మూత్ర పిండాల వ్యాధులు తగ్గటానికి తోడ్పడుతాయి.
- మలబద్ధకాన్ని పోగొట్టి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
- మైగ్రేన్ అనే తీవ్రమైన తలనొప్పికి దివ్యౌషధంలా పనిచేయడమే గాక, గుండె ఆరోగ్యాన్ని ఇవి కాపాడతాయి.
- ఆయాసం, ఉబ్బసం, ఆస్త్మా, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తూ, శరీరంలో నీరు చేరకుండా పిప్పళ్లు నివారిస్తాయి. చనుబాలు ఇచ్చే తల్లులు పిప్పళ్ళను వాడితే శిశువుల కాలేయం ఆరోగ్యంగా ఉంటూ, శరీరావయవాలు దృఢంగా ఉంటాయి.
- స్ర్తిల గర్భాశయ వ్యాధులకు దివ్యౌషధంలా ఇవి పనిచేస్తాయి. ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
- పిల్లలలో బుద్ధిని వికసింపజేసి, మేధాశక్తి పెరిగేలా పిప్పళ్లు దోహదపడతాయి. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.
- బాలింతలు పిప్పళ్ళు తింటే శిశువుల్లో శారీరక ఎదుగుదల బాగుంటుంది.

-కె.నిర్మల