ఐడియా

డిష్‌లు శుభ్రం చేయండి ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఆహ్లాదం, ఆరోగ్యం వంటింటి శుభ్రతతోనే సాధ్యం. ఇంట్లో వస్తువులు వివిధ రకాల పాత్రలు ఎప్పటికప్పుడు కడిగి మురికి చేరకుండా తళతళలాడేలా ఉంచుకోవాలి. దీనికి మార్కెట్లో లభ్యమయ్యే సబ్బులు, పౌడర్లతోపాటు కొన్ని చిట్కాలు కూడా అవసరం.
* టీకప్పులు, చిన్న జాడీలు, సున్నితమైన గాజు, పింగాణీ వస్తువులను శుభ్రపరిచేప్పుడు సింకు అడుగున ఒక పాత బట్టని అమర్చుకోవడం మరవద్దు.
* క్రాకరీ ఇంటి అందాన్ని మరింత ఇనుపడింపజేస్తాయనడంలో సందేహం లేదు. మరి అవి మరింత కాంతిని సంతరించుకోవాలంటే మామూలుగా కడిగిన వస్తువులను ఒక్కసారి ఉప్పు కలిపిన మంచినీటిలో ముంచి తీయాల్సిందే.
* దీపం కుందెలు, గ్లాసులు, గినె్నలు- ఇతర రాగి, ఇతర వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే వాటికి కడిగేప్పుడు క్లీనింగ్ పౌడర్ని కాస్త సిట్రిక్ యాసిడ్‌ని జత చేయాలి. చింతపండు, ఉప్పు మిశ్రమంతో కూడా ప్రయత్నించి చూడండి.
* బౌల్స్, జ్యూస్ జార్స్ లాంటి గ్లాస్‌వేర్ కొద్దిగా నీటితో తడిపిన ఉప్పుతో రుద్ది ధారగా వస్తున్న నీటిలో కడగాలి.
* జిగురు (గమ్)తో అంటిచ్చిన స్టిక్కర్లు, తుప్పు మరకలు లాంటివి తొలగించడానికి కొన్ని కిరోసిన్ చుక్కలతో కాసేపు నానపెట్టి ఆ తరువాత శుభ్రపరచుకోవాలి.
* టీ కప్పు లోపల అడుగు భాగం, చెంచా, గరిటల వంపులు- పాత్రలను సులభంగా శుభ్రపరచలేని ఇలాంటి స్థలాల్లో మరకలు ఏర్పడకుండా ముందుగానే జాగ్రత్తగా మెలగడం అవసరం. అవి తొలగించడానికి క్లీనింగ్ పోప్‌తోపాటు గోరువెచ్చని నీటిని వినియోగించాలి.