ఐడియా

పెదాలు.. తాజాగా..తేమగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదాలు ఎర్రటి లిఫ్ట్‌స్టిక్‌తోకాకుండా సహజ సిద్ధంగా తాజాగా కనిపించేందుకు మహిళలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఆలీవ్ ఆయిల్ లో తేనె, పంచదార కలపండి. పెదాలు శుభ్రంగా కడుక్కున్న తరువాత ఈ మిశ్రమంతో రుద్ది చూడండి. మంచి రంగు కనిపిస్తోంది.
రోజూ బ్రష్ చేసిన తరువాత, అదే బ్రష్‌పై ఒక టీస్పూను పంచదార ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనె వేసి పెదాలపై ముప్పయి సెకన్ల పాటు రుద్దండి. రోజూ ఇలా చేస్తుంటే పెదాలకు లిప్‌స్టిక్ వేయాల్సిన అవసరం ఉండదు.
ప్రతిరోజూ క్రమతప్పకుండా తాజా పండ్లూ, కూరగాయలూ తింటే మంచిది.
బీట్‌రూట్‌ను మెత్తని మిశ్రమంలా చేసి పెదాలకు రాసుకుని అరగంట తరువాత కడిగేసుకోండి. పెదాలు సహజ ఎరుపుదనంతో మెరుస్తాయి.
ఒక స్పూన్ వెన్నకు పసుపు కలిపి మిశ్రమాన్ని కలిపి తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట అరగంట సేపు అప్లయ్ చేయండి. పొద్దుటే కడిగేయండి. ఇలా తరచూ చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తోంది.
బాదం నూనె, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకుని రాస్తే పెదాలు నునుపుగా, తేమగా ఉంటాయి.
పాల మీగడతో రాత్రిపూట పెదాలను బాగా రుద్ది ఉంచేయండి. పొద్దుటే కడిగితే పెదాలు తేమగా ఉంటాయి.