ఐడియా

వస్తువులను శుభ్రపరచడమిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం కళే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వంటగదిలో ఎక్కడో ఒకచోట అపరిశుభ్రత తాండవిస్తుంది. ఇది కాస్తంత ఇబ్బందికరమే.. ముఖ్యంగా మైక్రోవేవ్స్ విషయానికి వచ్చేసరికి శుభ్రపరచడానికి బద్ధకం వేస్తుంది. కానీ వంటగదితో పాటు వంటగదిలోని వస్తువులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.. మైక్రోవేవ్స్‌ను పరిశుభ్రపరచుకోవడం కొంత ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని శుభ్రపరచాలంటే మరింత శ్రద్ధ కనబరచాలి. కిచెన్ సింక్స్‌లాగానే మైక్రోవేవ్స్‌ను శుభ్రపరచడం కాస్తంత కష్టమైన విషయమే. వీటిలో కూడా జిడ్డు పేరుకుపోవడం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకే తరచూ వీటిలోని జిడ్డును తొలగించుకోవాలి. లేదంటే ఒక్కసారిగా జిడ్డును తొలగించుకోవడం ప్రయాసను కలిగిస్తుంది. మైక్రోవేవ్‌లోని జిడ్డును సులభంగా, సమర్థవంతంగా, అలాగే త్వరగా సహజమైన పద్ధతిలో తొలగించుకోవాలంటే ఈ చిట్కాను పాటించాలి. కాస్తంత నీటిని ఒక కంటైనర్‌లోకి తీసుకోవాలి. దాంట్లో నిమ్మరసాన్ని కలపాలి. దాన్ని మైక్రోవేవ్‌లో ఉంచి వేడిచేయాలి. దాంతో మైక్రోవేవ్‌లోని చెడు వాసన అంతా పోతుంది. తరువాత వేడి నిమ్మకాయ నీరును మైక్రోవేవ్‌లోని జిడ్డును తొలగించుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే నీటిని వేడిచేస్తున్నప్పుడు అందులోంచి వచ్చిన ఆవిరి కూడా జిడ్డును సులభంగా తొలగించేందుకు తోడ్పడుతుంది. ఇలా మైక్రోవేవ్‌ను శుభ్రపరచుకోవడంతో దాన్ని తిరిగి బ్రాండ్ న్యూ మైక్రోవేవ్‌గా మార్చుకోవచ్చు.
అలాగే బేకింగ్‌సోడా కూడా వంటగదిలోని జిడ్డును తొలగించి పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అందుబాటులో ఉంచేలా చేస్తుంది. ఇది వంటగదిని శుభ్రం చేయడంతో పాటు, అందులో ఉన్న క్రిములు, బాక్టీరియాను సైతం తొలగిస్తుంది. అయితే స్టెయిన్ లెన్ స్టీల్ టోస్టర్‌ను మంచి కండీషన్‌లో ఉంచుకోవాలంటే దాన్ని తరచూ శుభ్రపరచుకోవాలి. అప్పుడే అది మనకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. క్రీమ్ ఆఫ్ టార్టార్‌లో కొద్దిగా నీళ్లను తీసుకుని ఈ నీటితో టోస్టర్‌ను శుభ్రం చేయడానికి ప్రయత్నించాలి. డ్రైయర్ షీట్‌ను ఉపయోగించి జిడ్డు, డర్ట్ అలాగే బేక్డ్ ఫుడ్స్‌కి సంబంధించిన మిగుళ్లు ప్యాన్‌కి అతుక్కుని ఉన్నవి సులభంగా తొలగిపోతాయి. సాధారణంగా క్లీనింగ్ పద్ధతుల్లో ఇవి తొలగిపోవు. వీటిని తొలగించాలంటే ఒక డ్రయర్ షీట్‌ను లేయర్‌లా ఉంచి ఇప్పుడు ప్యాన్‌లో కాస్తంత వెచ్చటి నీటిని వేసి నింపాలి. నీళ్లు ఆ షీట్‌ను టచ్ చేసినప్పుడు ఆ షీట్ అనేది డర్ట్‌ను, జిడ్డును ఆకర్షించి శుభ్రపరచడాన్ని మొదలుపెడుతుంది. ఈ పద్ధతిలో జిడ్డును అలాగే డర్ట్‌ను వేగవంతంగా అలాగే సమర్థవంతంగా శుభ్రపరచుకోవచ్చు.