ఐడియా

నిద్రకు ముందు ఇవి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రకు ఉపక్రమించగానే స్మార్ట్ఫోన్‌ను చేతిలోకి తీసుకుని ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా న్యూస్ ఫీడ్స్, సోషల్ నెట్‌వర్క్స్, చాటింగ్, సంగీతం వినడం మొదలైనవి. ఇలా తెలీకుండానే ఏదో ఒక అంశానికి అడక్ట్ అవడం జరుగుతుంటుంది. క్రమంగా కొన్ని గాడ్జెట్లకు పూర్తిస్థాయిలో అలవాటు పడిపోతారు. ఎంతలా అంటే అర్ధరాత్రుల్లో బాత్‌రూంకని నిద్రలేచినా ఆయా అంశాలను పర్యవేక్షించేలా.. కొందరైతే బాత్‌రూముల్లో కూడా మొబైల్స్‌ను వాడుతుంటారు. ఈ వ్యసనం కారణంగా కళ్లు ఎక్కువగా నీలికాంతికి ప్రభావితం అవడం జరుగుతుంది. క్రమంగా పొడిబారడం, జీవం కోల్పోవడమే కాకుండా కంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్‌కు కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు కానీ దూరంగా ఉండటం ఉత్తమం. ఇప్పటికీ నీలికాంతి వల్ల కళ్లు అధికంగా ప్రభావితం అవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజువారీ వాడకంలో కూడా స్మార్ట్ఫోన్, లాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటి స్క్రీన్ ఆధారిత గాడ్జెట్లను వినియోగిస్తున్నప్పుడు యాంటీ గ్లేర్ కంటి అద్దాలు వాడడం మంచిది. ఎండ వేడిమి తగలకుండా కూడా యు.వి. రక్షణ కవచం కలిగిన, పోలరాయిడ్ సన్‌గ్లాసెస్ వాడడం మంచిది.