ఐడియా

యోగతో వెన్నునొప్పి మాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిలకడస్థితిలో పని, కదలిక లేని జీవన విధానాల వల్ల వెనె్నముకలో, ము ఖ్యంగా కింది భాగంలో నొప్పి కలగటం సర్వ సాధారణం. తప్పుడు భంగిమ, చైతన్య రహిత జీవనం, ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం, పోషకాహారలోపం వల్ల వెనె్నముక కింది భాగంలో నొప్పిని కలుగచేసే కారణాలుగా చాలామంది చెబుతుంటారు. ఇది నిజమే.. వీటివల్ల భవిష్యత్తులో వెన్నునొప్పి మరింత పెరగవచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నా, భవిష్యత్తులో ఈ నొప్పి బారినపడకుండా ఉండాలంటే కొన్ని యోగా భంగిమలను అనుసరించాలి. కానీ వీటిని అనుసరించే ముందు నిపుణుల సహాయాన్ని తీసుకోవాలి. వెనె్నముక కింది భాగంలో నొప్పిని తగ్గించే వ్యాయామాలను చూద్దాం..
భుజంగాసనం
దీనినే ‘కోబ్రా’ భంగిమ అని కూడా అంటారు. ఈ యోగాసనం వల్ల వెనె్నముక భాగంలో కలిగే నొప్పులు తగ్గటమే కాకుండా వెనె్నముక వశ్యతను అంటే వంగే గుణాన్ని కూడా పెంచుతుంది. ఈ ఆసనాన్ని అనుసరించే పద్ధతిని తెలుసుకుందాం.. ఈ రకమైన భంగిమలో స్వతహాగా శరీరాన్ని వంచాలి. అంటే నుదురుభాగం భూమికి ఆనేలా నేలపై బోర్లా పడుకోవాలి. తరువాత అరచేతులను నేలపై ఉంచి శరీర సగభాగాన్ని లేపాలి. ఈ సమయంలో కాళ్లను అలాగే చాపి ఉంచి కాలి బొటనవేలును నేలను తాకి ఉంచాలి. ఈ భంగిమను చేసే ముందు గాలిని బాగా పీల్చి వదలాలి. ఈ భంగిమ చూడటానికి పాము పడగ విప్పినట్లు ఉంటుంది కాబట్టి దీన్ని కోబ్రా భంగిమ అని అంటారు. ఇలా చేయడం వల్ల వెనె్నముక నరాలపై ప్రభావం పడి నొప్పులను తగ్గిస్తుంది.
బ్రహ్మ ముద్ర
దీన్ని శ్వాస సంబంధిత యోగాసనం అని చెప్పవచ్చు. పైగా చాలా ముఖ్యమైన ఆసనం. ఇది గాలిని పీల్చుకుంటూ తలను తిప్పే వ్యాయామం. ఒక చదునైన నేలపై వెన్నును నిటారుగా ఉంచి కూర్చోవాలి. అంటే ధ్యాన భంగిమలో అన్నమాట. కానీ తొడలపై చేతులు ఉంచకూడదు. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీలుస్తూ తగిన విధంగా తలను కుడి, ఎడమలకు తిప్పాలి. అదేవిధంగా గాలిని వదులుతూ తలను అదే స్థానానికి తీసుకురావాలి. ఇలా చేసే సమయంలో గాలి పీలుస్తూ తలను పక్కకు తిప్పిన తరువాత ఊపిరి బిగబట్టి పది అంకెలను లెక్కపెట్టాలి. తరువాత తిరిగి మామూలు స్థానానికి తలను తీసుకురావాలి. ఇదే పద్ధతిలో తలను పైకి, కిందకు కూడా కలపాలి. ఈ ఆసనం వల్ల కండరాలు ఒత్తిడికి గురై విశ్రాంతి దశకు చేరతాయి. ఇలా రోజులో కొన్నిసార్లు చే యడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
సుప్త హస్త పదాంగుస్టాసన
నిశ్చల జీవనశైలిని అనుసరించేవారికి, వెనె్నముక నొప్పులతో బాధపడేవారికి ఇది చాలా మంచి ఆసనం అని చెప్పవచ్చు. ముందుగా శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతులను రెండు పక్కలా చాచాలి. తరువాత కుడికాలును పైకి లేపి కుడి చేతితో అందుకోవాలి. తిరిగి సాధారణ స్థితికి వచ్చాక మీ ఎడమకాలిని కూడా ఎడమ చేతితో అందుకోవాలి. ఇలా రోజుకు ఐదు నుంచి పదిసార్లు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ ఆసనాలన్నీ వెన్నునొప్పిని తగ్గిస్తాయి. యోగాసనాలను అనుసరించే ముందు తప్పనిసరిగా యోగ నిపుణుల దగ్గర తగిన శిక్షణ అవసరం.