ఐడియా
బరువు తగ్గించే చిట్కాలు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బరువు తగ్గడానికి చాలామంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. తిండిమానేయడం, అర్ధరాత్రి వరకు నిద్రమానేయడం, ఒక్కరోజులోనే సన్నగైపోవాలని విపరీతమైన వర్కవుట్స్ చేయడం.. వంటి పనులన్నీ చేస్తుంటారు. ఇవన్నీ బరువు పెరగడానికి కారణాలు అవుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య కూడా బరువును పెంచుతుంది తెలుసా! నిద్రలేమి సమస్య వల్ల ఆకలిని నియంత్రించే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. తినే తిండిపై నియంత్రణ లేకపోవడం వల్ల బీఎంఐ పెరిగిపోతుంది. అలాగే ఆహారం తిన్న తరువాత సంతృప్తినిచ్చే లెప్టిన్ అనే హార్మోను స్థాయి కూడా తగ్గిపోతుంది. దాంతో ఎక్కువగా తిని బరువు పెరిగిపోతారు. ఒత్తిడి ఉన్నప్పుడు విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోను ట్రైగ్లిజరాయిడ్లను విడుదల చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతాయి. దానివల్ల ఆకలి వేయకపోవడం లేదా అతిగా తినేయడం చేస్తారు.
రుచికరమైన ఆహారం తినడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో.. దానిని కరిగించుకోవడానికి, వ్యాయామానికి అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ మనలో చాలామంది ఆ పనిచేయడం లేదు. అలాగే రెస్టారెంట్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఉపయోగించే ఆహారంలో ఉప్పు వాడకం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని నీటి నిల్వల్ని తగ్గించి అధికబరువుకి కారణమవుతుంది. బరువు తగ్గాలనుకున్న చాలామంది అన్నం తినడం మానేస్తారు. నిజానికి దానికన్నా నూనెలు, చక్కెరలు మానేస్తేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. వీటివల్ల వరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయనే మాట నిజమే కానీ.. వాటి వల్ల మాత్రమే అవి అందుతాయని కాదు! కొన్ని రకాల ఇన్‌విజబుల్ ఫ్యాట్లు మనం గింజల నుంచీ, మాంసాహారం నుంచి పొందొచ్చు. మనం ఆహారం తగ్గించాలని అనుకున్నప్పుడు ఒక్క కార్బోహైడ్రేట్లనే మానేసి ఊరుకుంటే సరిపోదు. ప్రొటీన్ల నుంచి కొంతా, కొవ్వుల నుంచి కొంతా.. ఇలా అన్నింటి నుంచీ కొంత కొంత తగ్గించుకోవాలి. అంటే.. ఆహారం తగ్గించుకోవడం కూడా సమతులంగా ఉండాలన్నమాట. అలా అయితే బరువు పద్ధతిగా తగ్గుతున్నట్టు.
బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్స్‌ని పూర్తిగా దూరంగా పెట్టాల్సిన పనిలేదు. ఇది చాలా పొరపాటు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన పిండి పదార్థాలు అందక ఇతర సమస్యలొస్తాయి. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే కాయగూరలు, పండ్లూ, ధాన్యాలు కూడా పోషకాహారంలో భాగమేనని గుర్తుంచుకోవాలి. మీకు తెలుసా.. పీచు కూడా కార్బోహైడ్రేటే.. అలాగే చాలామంది తినడం మానేస్తే సన్నబడతామని అనుకుంటారు. అనుకున్నదే తరవాయి అన్నట్లు బరువు తగ్గాలన్న తాపత్రయంలో అల్పాహారం, భోజనం మానేయడం వల్ల రోజంతా ఆకలితో ఉంటారు. ఫలితంగా ఒక్కసారిగా అధికంగా తినేస్తారు. లేదంటే చిరాకు, అసహనం, ఒత్తిడి వంటివీ ఎదురవుతాయి. ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి. దీనివల్ల క్రమంగా జీవక్రియ రేటు పడిపోతుంది. అందుకే వీలైతే ఒక భోజనాన్ని ఒకేసారి తినడం కంటే మూడుసార్లు తినడం మంచిది. కానీ వీటిల్లో అన్ని రకాల పోషకాలు ఉండేట్లు చూసుకోవాలి సుమా! ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా అరగంట వ్యాయామాలు చేయడం వల్ల తప్పనిసరిగా బరువు తగ్గుతారు.