ఐడియా

అందాలొలికే కళ్ల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ కంటి మేకప్ నేచురల్‌గా ఉంటే అందం మరింతగా పెరుగుతుంది. కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. కళ్ళలోని భావాలు ప్రస్ఫుటంగా వ్యక్తమవుతాయి. అలాంటి వాటికోసం మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
* మేకప్ ఎవరు చేసినా కన్సీలింగ్ కానీ బేస్ కానీ పెట్టడం మర్చిపోవద్దు. నల్లని వలయాలు ఉంటేనే కన్సీలింగ్ చేయాలి. తర్వాత బేస్‌కు బదులు ఫౌండేషన్ అప్లయ్ చేయాలి. ఆ తర్వాత లైట్ ట్రాన్స్‌లెంట్ పౌడర్ రాయాలి. అప్పుడే ఐ మేకప్ సెట్ అవుతుంది.
* తదుపరి ఐ లైనర్‌ను వాడాలి. ఐ షేడ్ తర్వాత లైనర్ వాడితే డల్ లుక్ వస్తుంది. కాబట్టి దీనిని లైట్‌లైన్‌కు దగ్గరలో ఉపయోగించాలి.
* ఐ షేడ్స్ డే టైమ్‌లో లైట్‌షేడ్స్, ఈవినింగ్ టైమ్‌లో బ్రైట్, కాంట్రాస్ట్ షేడ్స్‌ను ఉపయోగించాలి. రెండు లేక మూడు షేడ్స్‌లున్న ఐషేడ్స్ ఉపయోగించడం మంచిది. లైట్ షేడ్‌ను అప్పర్ ఐలిడ్ నుండి ఐ బ్రోస్ ఏరియా వరకు, మీడియమ్ షేడ్‌ను అప్పర్, మిడిల్ ఏరియాపై అప్లయి చేయాలి.
* ఐ లాసెష్ మందంగా కనిపించడంకోసం ఫాల్స్ ఐలాసెష్‌ను ఉపయోగించాలి. ఆ తర్వాత ఐ లైన్ క్లర్స్‌తో సెట్‌చేయాలి. చివరగా మస్కరాను పెట్టాలి. కాని రెండు కోటింగ్‌ల కంటే ఎక్కువ పెట్టొద్దు. మస్కారా కంటే ఐ లవర్ ఐ లైనర్ కలర్‌తో మేచ్ అయ్యేలా చూడాలి.
* మస్కారా బ్రష్‌ను అప్పర్ లాసెష్ రూట్స్‌నుంచి టిప్‌వరకు బయటకు తేవాలి. మొదటి కోటింగ్ డ్రైగా వుండాలి. రెండవ కోటింగ్ లాసెష్‌ను కర్ల్ చేయాలి. ఆ తర్వాత లోయర్ లాసెష్‌పై మస్కారా పెట్టాలి. ఐ లాసెష్‌ను విడివిడిగా చేయటానికి లోయర్ లైన్ బ్రష్ కాని నైస్‌వోంటోకాని ఉపయోగించాలి.
* మీ ఐబ్రోకి నేచురల్ లుక్ రావాలంటే బ్లాక్, బ్రౌన్ ఐబ్రో పెన్సిల్‌తో షెప్ ఇవ్వాలి. కళ్ళపై వున్న షేడ్స్‌ను, మస్కారాను శుభ్రపరచడానికి కాటన్ బడ్‌ను ఉపయోగించాలి.
* చక్రాల్లాంటి కళ్ళను చేపకళ్ళ మాదిరిగా చేసుకోవాలంటే అప్పర్, లోయర్ లైస్‌లైన్‌నుంచి రెండవ వంతు బయట భాగంలో ఆ లైనింగ్ చేయాలి. మూలల దగ్గర మందంగా లైన్‌ను తీర్చిదిద్దాలి. న్యూటల్ షేడ్స్ అప్లయి చేయాలి.
* చేప కళ్ళు ఉన్నవారికోసం విలైనింగ్‌ను లోపలనుంచి బయట మూలలవరకు స్ట్రెయిట్‌గా హారిజంటల్‌గా చేయాల్సి వుంటుంది. అప్పర్, లోయర్ లాసెష్‌పై ఐలాష్ కర్లర్‌ను ఉపయోగించాలి. మస్కారాతో ఐలాసెష్ బయటి కోణాలపై మాత్రమే టచ్ ఇవ్వాలి.
* చిన్నచిన్న కళ్ళు ఉండే వారికోసం బ్లూ, బ్రూన్ ఐ లైనర్‌ను ఉపయోగించాలి. మందంగా ఐ లైనింగ్ ఇవ్వాలి. ఈ ఐలైనింగ్ కళ్ళమొదటి నుంచి కాకుండా మధ్యభాగంనుంచి బయటివైపుగా ఇవ్వాలి. తర్వాత ఐ లైష్ కర్లర్ మస్కరాను ఉపయోగించాలి.
* పల్చటి కళ్ళు ఉన్నవారికి డార్క్ ఐలైనింగ్‌ను ఇవ్వాలి. మూడవ వంతు లోపలి భాగంనుంచి, బయటి భాగంవరకు అప్పర్, లోయర్ ఐస్‌లైన్ రెండింటిపై మళ్ళీ లైట్ షేడ్‌ను ఇవ్వాలి. కళ్ళచివరి మూలలవరకు బ్లెండ్ చేయాలి. మస్కారాను కేవలం మధ్య, బయట మూలం ఐలాస్ సెష్‌పైనే అప్లయి చేయాలి.
* కళ్ళకు స్మోకీ లుక్ ఇవ్వడానికి బ్లాక్, బ్రౌన్ కలర్ ఐలైనర్‌ను అప్పర్ లాష్ లైన్‌పై ఉపయోగించాలి. బ్లూ, వైలెట్, మాష్‌గ్రో, బ్రౌన్, బ్రాంజ్, సిల్వర్ ఐ షేడ్‌లను డార్క్‌చేసి అప్పర్ లోయర్ లిడ్‌పై అప్లయ్ చేయాలి.
* కళ్ళకు షిమారీ లుక్ ఇవ్వడానికి ముందు బ్రౌన్ గాని, బ్లాక్ గాని, బ్లాక్ ఐ లైనర్ ఉపయోగించాలి. తర్వాత క్రీమ్ గాని కొంచెం పసుపురంగు షాడో బేస్‌ను వాడాలి. బ్రౌన్, పింక్ షాడోను అప్పర్, లోయర్ లిడ్‌పై అప్లయ్ చేయాలి. తర్వాత మస్కారా ఉపయోగించాలి. షీమర్‌ను లాష్ లైన్, లాసెష్ అంచులపై ఉపయోగించాలి.
* రాత్రి ఐ మేకప్ తీసేయడం మరిచిపోవద్దు. కాటన్ వూల్ తీసుకుని కళ్ళను చాలా సున్నితంగా శుభ్రపరచాలి.

- పి.ఎం. సుందరరావు 9490657416