ఐడియా

ఔషధ గుణాల తమలపాకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సాంప్రదాయం, సంస్కృతిలో తమలపాకులకు ఎంతో విలువ, విశిష్ట స్థానం ఉన్నాయి. ప్రతి శుభకార్యానికి తమలపాకులు ఉండవలసిందే. ఆయుర్వేద వైద్యంలో కూడా తమలపాకులు వాడతారు. వీటిలో విటమిన్ ఎ, బి కాల్షియం, కెరోటిన్, ఆరోమాటిక్ తైలాలు ఉంటాయి.
* బ్రాంకైటిస్, ఆస్త్మా, శ్వాసకోశ వ్యాధులకు నివారణ కలిగిస్తుంది. రక్తవృద్ధిని కలిగిస్తాయి.
* తమలపాకుల్లో వున్న క్లోరోఫిన్ నోటి పూతకు ఉపశమనాన్ని కలుగజేస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది తాంబూలం.
* దీని తీగను ఎండబెట్టి, పొడి చేసి ఆ పొడిలో తేనెను కలిపి తీసుకుంటే కంఠం ఎంతో శ్రావ్యంగా వుంటుంది.
* వెన్నను కాచిన నేతిలో తమలపాకును వేస్తే నెయ్యి సువాసనగా ఉండటమే కాక ఆ నెయ్యి వాసన రాకుండా నిలవ ఉంటుంది.
*బాలింతరాలు తమలపాకులు వేసుకుంటే ఎముకలు దృడపడతాయి.
* వీటి రసం, తేనె కలిపి పుచ్చుకుంటే కంఠస్వరం శ్రావ్యంగా మారుతుంది. జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
* కణతలు, నుదురు నొప్పిగా ఉంటే తాజా తమలపాకులను నుదుటిమీద, కణతలమీద పెట్టుకుని, అవి వడిలిపోయేవరకూ ఉంచితే బాధకు నివారణ కలుగుతుంది.
* తమలపాకులకు ఆముదం పూసి, వెచ్చ చేసి సెగ్గడ్డలమీద పెట్టి కట్టుకడితే బాధ తగ్గిపోతుంది. దంతాల నొప్పిని తగ్గిస్తుంది.
* చంటి పిల్లలకు అజీర్తి చేసి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పితో ఏడుస్తుంటే తమలపాకులను వెచ్చచేసి పాపాయి పొట్టమీద పెడితే కడుపు మెత్తబడి సాఫీగా విరేచనం అవుతోంది.

-కె.నిర్మల