ఐడియా

అందమైన పెదవుల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖానికి నవ్వు ఎంత అందాన్నిస్తుందో పెదవుల నాజూకుదనం ఆ నవ్వుకు మరింత అందాన్నిస్తుంది. కొందరి ముఖం చక్కని ఛాయతో ఉన్నా పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి. కొందరికి వాతావరణాన్ని బట్టి నల్లబడి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరి..
* దానిమ్మ గింజల్ని పేస్ట్ చేసి.., అందులో పాలమీగడ, రోజ్‌వాటర్ వేసి కలపాలి. దీనితో పెదవులను బాగా రుద్ది ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ చేస్తే నలుపు పోయి పెదవులు మంచి రంగులోకి మారతాయి.
* కొన్ని గులాబీ రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిలో కొంచెం తేనె, పాలమీగడ, వెన్న వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు పెదవులను మసాజ్ చేస్తే నలుపు పోతుంది.
* గులాబ రేకులను పాలలో వేసి నానబెట్టాలి. తర్వాత పేస్ట్ చేసి తేనె, చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీన్ని పెదవులకు రాసి పదిహేను నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
* క్యారెట్ రసాన్ని, బీట్‌రూట్ రసాన్ని సమపాళ్లలో కలిపి దానితో పెదవులపై సున్నితంగా పదినిముషాల పాటు రుద్దాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజుకోసారి ఇలా చేస్తే రెండు వారాల్లో ఫలితం కనిపిస్తుంది.
* చెంచాడు స్ట్రాబెర్రీ జ్యూస్‌లో రెండు చెంచాల పెట్రోలియం జెల్లీ వేసి రోజూ రుద్దుకున్నా ఫలితం ఉంటుంది. *