ఐడియా

చిన్నారులకు లాల ఇలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిబిడ్డలకు స్నానం చేయంచటం అంటే అంత తేలికైనా పని కాదు. స్నానం చేయంచేటపుడు నీళ్లు మింగేస్తుంటారు. గజ్జి, తామరలాంటివి శరీరంపై కనిపిస్తే ఆ ప్రాంతంలో శుభ్రం చేయటానికి తల్లులు భయపడతారు. ఇలాంటి చర్మవ్యాధులు ఉన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్నానం చేయించమని అంటున్నారు. ఇలా రోజూ స్నానం చేయించటం వల్లనే వారికి ఆ వ్యాధులు త్వరగా మానిపోతాయని చెబుతున్నారు. వాస్తవానికి చర్మంపై తేమ ఎక్కువగా ఉన్నా, డైపర్స్ సరిగా లేక తామర వస్తోంది. అక్కడ తాకితే మంటగా ఉంటుంది. కాని ఆయిల్‌తో మర్ధన చేసి చక్కగా స్నానం చేస్తేనే మంచిదని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. కాకపోతే సబ్బు విపరీతంగా వాడవద్దని అంటున్నారు. దీనివల్ల తేమను గ్రహిస్తుందని చెబుతున్నారు. స్నానం కేవలం 10 నిమిషాలు మాత్రమే చేయించాలని, ప్రతిరోజూ స్నానం చేయించటం వల్ల గజ్జి, తామర వంటి చర్మవ్యాధులు ఉన్నా వాటి నిర్మూలనకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. పిల్లలకు స్నానం చేయించటం వల్ల శరీరంపై ఉండే మురికి తొలిగిపోతుందని దీనివల్ల వారికి చికాకు, కోపంలాంటివి రావని, అలాగే అలర్జీల నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు. బాగా వేడినీటితో కాకుండా గోరువెచ్చటి నీటితో స్నానం చేయిస్తే మంచిదని చెబుతున్నారు. స్నానం చేయించిన తరువాత మెత్తటి టవల్‌తో తుడిచి చర్మాన్ని మృధువుగా ఉంచే లేపనాలు రాస్తే మంచిదని అంటున్నారు. కాస్మోటిక్ లేపనాలు రాయవద్దని సూచిస్తున్నారు.