ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలు తాగడానికి కొంతమంది పిల్లలు ఇష్టపడరు. అలాంటివారికి పాలలో కొద్దిగా జామ్ కలిపి మిక్సీలో వేసి ఇస్తే పండ్లతో తయారుచేసిన మిల్క్ షేక్‌లాగా వుండి తాగటానికి ఇష్టపడతారు.

నల్లబట్టలు సబ్బుతో కాకుండా సీకాయ పొడితో వుతికితే రంగు తగ్గిపోకుండా వుంటాయి.

ఫ్రిజ్‌లో వెన్న పెట్టినపుడు గట్టిగా రాయిలాగా అవుతుంది. అది త్వరగా మెత్తబడాలంటే వెన్న వున్న గినె్నమీద ఒక గినె్న బోర్లించి, దానిమీద వేడి నీళ్ళలో ముంచిన మందపాటి బట్ట కప్పితే వెన్న త్వరగా మెత్తబడుతుంది.
గోరులో ఎప్పుడైనా చెక్కపేడుగాని, గాజు ముక్కలుగాని ఇరుక్కుంటే విపరీతంగా నొప్పి చేస్తుంది. వాటిని తీయడం కష్టంగా వుంటుంది. అలాంటప్పుడు ఫెవికాల్ కొంచెం గోరు చుట్టూ పోసి, ఆరిన తరువాత ఆ పొరను జాగ్రత్తగా తీస్తే దానితోపాటు గోరులో ఇరుక్కున్న చెక్కపేడు కూడా వచ్చేస్తుంది.

బెండకాయ కూర చేసేటపుడు జిగురు వస్తుంది. అది పోవాలంటే వేగినపుడు ఒక స్పూను చింతపండు పులుసు పోస్తే జిగురు పోతుంది.
బజారులో అమ్మే ఎండు బఠానీలు, చిక్కుళ్ళు లాంటివి ముందు రోజు రాత్రి వేడినీళ్ళ ప్లాస్కులో నానబెట్టి, తెల్లవారి ఉడకబెడితే త్వరగా ఉడుకుతాయి.

నూలు వస్త్రాలకు గంజి పెట్టేటపుడు గంజిలో కొద్దిగా ఉప్పు కలిపితే బట్టలు మెరుపుగా వుంటాయి.

చేతికి కిరసనాయిలు అయితే, చేతిని కొబ్బరినూనెతో రుద్ది, సబ్బుతో కడుక్కుంటే వాసన పోతుంది.

దోస పెనానికి అంటుకుని రాకపోతే, పెనంమీద నూనె వేసి బంగాళాదుంప కాని, ఉల్లిపాయగాని అడ్డంగా కోసి ఆ ముక్కతో పెనంమీద రుద్ది దోసె వేస్తే అంటుకోకుండా వస్తుంది.

కూరలో ఉప్పు ఎక్కువయితే కొబ్బరిముద్ద లేక టమోటా ముక్కలు లేక ఉల్లిపాయ ముక్కలు వేయించి వేసినా తగ్గుతుంది.

- బి.మాన్‌సింగ్ నాయక్