ఐడియా

వేపనూనెతో దోమలు పరార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో దోమలు విజృంభించే కాలం. అవి మనం విడిచిపెట్టే కార్బన్ డై ఆక్సైడ్‌కు ఆకర్షితమవుతాయట. అందుకని వాటిని పట్టుకోవాలంటే ఐస్ గడ్డలను ఓ కంటెయినర్‌లో ఉంచి ఇంట్లో అక్కడక్కడ ఉంచాలి. దోమలు వీటి దగ్గరకు చేరతాయి. అప్పుడు దోమలను ఎలక్ట్రిక్ బ్యాట్‌తో పూర్తిగా చంపవచ్చు.
* వేప నూనె, కొబ్బరి నూనె ఈ రెండింటినీ సమాన పాళ్లలో తీసుకుని చర్మంపై రాసుకోవాలి. కనీసం ఎనిమిది గంటలు పాటు ఇది పనిచేస్తుంది. దోమలు కుట్టే సాహసం కూడా చేయవు. మీ సమీపానికి వచ్చినా వేప వాసన చూసి పారిపోతాయి. ఈ ఫార్ములాను జర్నల్ ఆఫ్ అమెరికన్ మస్క్విటో కంట్రోల్ అసోసియేషన్ ప్రచురితమైంది. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ప్రోటోజోల్ గుణాలు వేపనూనెలో ఉన్నాయి. చర్మ సౌందర్య, రక్షణకు కొబ్బరి నూనె పనిచేస్తోంది. కాటన్‌ను చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని వేపనూనెలో ముంచి ఇంటిలోపల ప్రతి గదిలోనూ ఉంచాలి. దీనివల్ల కూడా దోమలు కంట్రోల్ అవుతాయి.
* ఇంటి సమీపంలో నిరు నిలిచిన చోట దోమలు గుడ్లు పెట్టి ఉంటాయి. కాఫీ డికాషన్ చల్లడం ద్వారా ఆ నీటిలోని దోమల గుడ్లు నీటిపైకి చేరతాయి. అవి ఆక్సిజన్‌కు లోను కావడం వల్ల దోమలుగా మారకుండానే నిర్వీర్యమైపోతాయి. అంతేకాదు ఆ నీటిలో దోమలు గుడ్లు కూడా పెట్టవు.