ఐడియా

వ్యాయామంతో శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు ఇంటి పని, వంట పని ఇలా అన్నీ ముగించుకుని ఆఫీసుకు వెళ్లినప్పటికీ నిస్సత్తువుగా ఉంటారు. ఏ పనిచేయలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఉద్యోగం చేసే ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య ఇది. పోషకాహారం తీసుకోకపోవటం వల్ల వచ్చే సమస్య కాదు. శరీరానికి కావల్సిన వ్యాయామం లేకపోవటం వల్ల కూడా ఇది జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
* రోజూ అరగంట సేపు నడక అలవాటు చేసుకోవాలి. లేదా చిన్నపాటి ఏరోబిక్స్ చేసినా ఫర్వాలేదు. వీటికి తోడు తగిన ఆహారం తీసుకోవాలి. దీనివల్ల స్టామినా పెరుగుతుంది. నీరసం తగ్గాలంటే కార్బోహైడ్రెడ్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్లు, సమపాళ్లలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీరు తీసుకోవాలి. చలికాలం అయినా సరే నీరు తప్పకుండా తీసుకోవాలి.
* యోగాసనాల వల్ల శారీరక దారుఢ్యం పెరుగుతుంది. కాబట్టి నిపుణుల శిక్షణలో అటువంటి ఆసనాలను రోజూ చేస్తే మానసిక, శారీరక ఆనందం కలుగుతుంది. యోగాసనాలు వేయటం వల్ల ప్రశాంతంగా ఉంటుంది.