ఐడియా

ఒకసారైనా ఎండలో నడవాలి.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యం ఇంట్లో లేదా నీడ పట్టులో వున్నవారికి విటమిన్ డి అవసరమైనంతగా దొరకదు. దీనివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం వుంది. కనీసం మూడు రోజులకు ఒకసారైనా ఎండలో నడవాలి.
పసందైన ఇడ్లీల కోసం ఇడ్లీ పిండిలో కొద్దిగా నూనె కలపండి. అప్పుడు ఇడ్లీలు మృదువుగా ఉంటాయి. ఇంటిల్లిపాది లొట్టలు వేసుకుని తింటారు.
పిల్లలకు దుస్తుల ఖరీదు తెలీదు. వాటి విలువా తెలియదు. వారి పని దుస్తులను ఇష్టానుసారంగా వాడడమే. ఈ సమయంలో వాటిపై ఇంకు మరకలు పడుతుంటాయి. వీటిని కొద్దిగా బేకింగ్ సోడాతో రుద్దాలి. అలాగే వెనిగర్‌లో ముంచి ఉతికితే ఆ మరకలు పోతాయి.
ఉల్లి తర్వాత తల్లి నిమ్మకాయ. దీనిని వినియోగించుకున్నవారికి బోలెడు ప్రయోజనాలు! పిండేసిన నిమ్మకాయ తొక్కల్ని తొక్కే కదా అని పారేయకండి. కుక్కర్‌లోపల మరకలు పట్టకుండా ఉండాలంటే ఈ తొక్కల్ని అడుగున పడేసి వండుకోండి.
నోరూరిచే తీపి పదార్థాలు, జీడిపప్పు వంటివి పాడవకుండా కొద్దిగా ఎత్తుగా వున్న స్థలంలో పెట్టండి. దిగువన దాని చుట్టూ చీమల మందు చల్లండి. అప్పుడు మీకు చీమల దండు కనిపించదు. మీ పదార్థాలు భద్రంగా ఉంటాయి.