ఐడియా

షుగర్ పేషెంట్లకు పనికొచ్చే ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ప్రతిరోజూ ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. కాని వీటిలో ఏది మనకు ఎక్కువ పోషకాలను అందిస్తుందో తెలియదు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఆహార నియంత్రణ పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. వీరు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. విపరీతమైన నీరసం, అలసటకు గురవుతుంటారు. కాబట్టి ఈ నీరసాన్ని దరిచేరనీయకుండా ఉత్సాహంగా పనిచేయాలంటే మధుమేహాం, బీపీ పేషెంట్లు ఆహార పానియాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా మంచి ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. వారికి కావల్సిన పౌష్టికాహారాన్ని ఇంట్లో ఇలా తయారుచేసుకోవచ్చు. రాగులు, గోధుమలు-1/2 కేజీ, కొమ్ము శనగలు, సోయాగింజలు, వేరుశనగ గుళ్లు, నూలుపప్పు, పావుకిలో చొప్పున, బార్లీ వంద గ్రాములు చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. వేగిన వాటిని మెత్తగా మిల్లు పట్టించాలి. ఆ పిండిని అంబలిలాగ చేసుకోవచ్చు. పాలు వేసి బోర్న్‌విటాలాగా తాగవచ్చు. లేదా ఆ పిండిలో బెల్లం కలుపుకొని ఉండలుగా చేసుకుని అప్పుడప్పుడు తినవచ్చు. దీనివల్ల షుగర్, బీపీ పేషెంట్లకు ఉండే నీరసం తగ్గుతుంది. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.