ఐడియా

నెయ్యితో కురులకు మెరుపులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై సంవత్సరాల వెనక్కి వెళితే.. ఆనాడు మహిళలు ఒతె్తైన కురులతో వాలు జడ వేసుకుంటే చూపు తిప్పుకునేవారు కాదు. కాని నేడు కాలుష్యం పెరిగిపోయి, వాతావరణం వేడెక్కిపోవటం వల్ల ఆ సౌందర్యం కానరావటం లేదు. తలస్నానం చేసి తలదువ్వుకుంటే జుట్టు విపరీతంగా ఊడి చేతుల్లోకి వచ్చేస్తుంది. దీనికితోడు తెల్ల వెంట్రుకల సమస్య మరీ వేధిస్తోంది. సాధారణంగా జుట్టు సంరక్షణ కోసం రకరకాల నూనెలు వాడుతుంటాం. అయితే నెయ్యి కూడా జట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. నెయ్యి ఎలా రాసుకుంటాం అని ఆశ్చర్యపోతున్నారా?. దేశీయ నెయ్యి శిరోజాలకు మంచి కండీషనర్‌గా నిగనిగలాడేలా చేస్తుందట. రెండు చెంచాల నెయ్యిని ఒక చెంచా ఆలివ్ ఆయిల్‌తో కలిపి తల వెంట్రులకు రాసి ఇరవై నిమిషాలు పాటు అలా ఉంచెయ్యాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.