ఐడియా

రోజూ క్యారెట్ తింటే అనారోగ్య సమస్యలకు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటికి ఇంపుగా కనిపించే క్యారెట్ తింటే అనేక అనారోగ్య సమస్యలను మన నుంచి దూరం చేసుకున్నట్లే. రోజూ ఓ క్యారెట్ చొప్పున తింటే శరీర ఛాయ పెరుగుతుంది. అంతేకాదు శరీరంలో తేమశాతం పెరుగుతోంది. అల్సర్, గ్యాస్ లాంటి సమస్యలు రెండు నెలల్లోనే అదుపులోకి వస్తాయి. ఇందులో లభించే బీటాకెరోటిన్ అనే పదార్థం విటమిన్ ‘ఏ’గా మారుతోంది. ’ఎ’ విటమిన్ కంటికి ఎంతోఅవసరం. కంటి సమస్యలు దరిచేరవు. రోజూ కొంచెం క్యారెట్ రసం తీసుకుంటే మనిషి శరీర రంగులో కూడా మార్పు వస్తోంది. అంతేకాదు ఈ క్యారెట్ యాంటీ క్యాన్సర్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలు వృద్ధికాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ బారిన పడినవారు చికిత్స అనంతరం ప్రతి రోజూ తమ ఆహారంలో క్యారెట్‌ను తీసుకోమని వైద్యులు సలహా ఇస్తుంటారు. శరీరంలోని ఇన్‌ఫెక్షన్లు తగ్గించే యాంటీసెప్టిక్‌గా కూడా ఇది పనిచేస్తుంది. గోళ్లను, జుట్టును బలంగా ఉంచుతోంది. పిల్లలకు పచ్చి క్యారెట్ తినే అలవాటు చిన్నవయసు నుంచే చేస్తే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు.