ఐడియా

పులి నోట్లో తల పెడదామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులి అంటేనే భయం. పైగా దాని నోట్లో తల పెట్టటమా..? అమ్మో అని అనకండి. ఈ మహిళా వలంటీర్ చూడండి..పులితో ఎంచక్కా ఆడుకుంటుంది. మీరు కూడా ఇలా పులికి దగ్గరగా వెళ్లి దాని జుట్టును నిమరాలనుకుంటున్నారా..? అయితే థాయిలాండ్‌లోని పులి దేవాలయానికి వెళ్లండి. మీ సరదా తీరుతుంది. బ్యాంకాక్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. థాయిలాండ్‌లోని కాంచనపురిలో ఉన్న ఈ దేవాలయంలో ఇపుడు దాదాపు వంద పులుల వరకు ఉన్నాయి. దేవాలయం అంటే పులులకు పూజలు చేస్తారనే భ్రమ పడకండి. బౌద్ధ సన్యాసలు వీటిని ప్రేమగా పెంచుతున్నారు. దీనిని బౌద్ధ అభయారణ్యం అని కూడా అంటారు. దీనిపై తొలుత జనంలో వ్యతిరేకత కూడా వచ్చింది. ఎందుకంటే ఒకసారి ఓ పులి టూరిస్ట్‌పై దాడి చేయటంతో ఈ అభయారణ్యాన్ని తొలగించాలని కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. తదనంతరం బౌద్ధుల సంరక్షణలో ఇలాంటి అలజడ ఏదీ లేకుండా ఇపుడు ఈ పులి దేవాలయం సందర్శకులను ఆకర్షిస్తోంది. 1994లో ఏర్పాటైన ఈ దేవాలయానికి అక్కడి ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయిస్తోంది. క్రూరమైన పులులకు చక్కటి శిక్షణ ఇవ్వటం వల్ల అవి సందర్శకులతో కలిసిపోయి హాయిగా ఉంటాయి. సందర్శకులు కూడా తాము పెద్ద పులి దగ్గరకు వచ్చామని అనుకోరు. పెద్ద పిల్లి వద్దకు వచ్చి ఆడుకుంటున్నామని భావిస్తారు. మరి పులి నోట్లో తల పెడతామా..!