ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోచేతులు నల్లగా, గరుకగా ఉంటే అసహ్యంగా ఉంటాయి. అలా ఉన్నవారు నిమ్మచెక్కను తరుచుగా మోచేతుల వద్ద రుద్దుకుంటుంటే నలుపుదనం, గరుకుదనం తగ్గి, నునుపుగా కాంతివంతంగా వుంటుంది.
కోల్డ్‌క్రీముగాని, మీగడగాని రాసి మసాజ్ చేస్తూ వుంటే మెత్తబడి అందంగా వుంటుంది. మోచేతులు ఎక్కువగా బల్లమీద ఆనించి కూర్చోవడం, గోడల మీద ఆనించి వంగోవడం చెయ్యకూడదు. దీనివల్ల మోచేతి ప్రదేశం నల్లగా అవుతుంది.
అరచెంచా బాదం పొడి, కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై రాసి మసాజ్ చేసి పది నిమిషాలు తరువాత శుభ్రం చేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే నలుపుదనం పోతుంది.
శనగపిండి చర్మాన్ని మృధువుగా మారుస్తుంది.
కీరదోస ముక్కతో తరుచూ మోచేతులకు మర్దన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అరచెంచా చొప్పున పసుపూ, గంధం, కొన్ని చుక్కల గులాబీ నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి పావుగంట తర్వాత శుభ్రం చేయాలి.
చెంచా చొప్పున పాలూ, తేనె, పసుపూ కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఎండ వల్ల నల్లగా కమిలిన చర్మాన్ని కలబంద చక్కటి పరిష్కారం. కలబంద గుజ్జును మోచేతులకు రాసి అరగంట తరువాత కడిగితే సరిపోతుంది.