ఐడియా

జామతో కంటి జబ్బులు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటికి జబ్బులు నుంచి దూరం చేసే కాయగూరలు, పండ్లు మీద ఇటీవల ఎయిమ్స్ వైద్యుల బృందం విస్తత్ర పరిశోధనలు చేసింది. పేదవాడి యాపిల్‌గా పిలువబడే జామ కంటికి ఎంతో మేలు చేస్తుందని ఆలిండియా మెడికల్ సైన్స్ వైద్యులు చెబుతున్నారు. అలాగే నల్లద్రాక్ష, కొత్తిమీర, మెంతుకూర కూడా దృష్టిలోపాలను నివారిస్తుందని వీరి పరిశోధనలలో వెల్లడైంది. డాక్టర్ అలోక్ కుమార్ రవి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌లతో కూడిన రీసెర్స్ బృందం ఢిల్లీ, మధురైలలో విస్తత్రంగా సర్వే నిర్వహించింది. దాదాపు 25 పండ్లు, 75 కూరగాయల శాంపిల్స్‌తో వీరు పరిశోధనలు చేశారు. సామాన్య మానవుడు తీసుకునే జామకాయ, మెంతికూర, కొత్తిమీరలలో కంటి చూపు జబ్బులను చాలావరకు నివారించుకోవచ్చని వీరు వెల్లడిస్తున్నారు. వీటిని వాడటం వల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే దృష్టిలోపాలను చాలావరకు నివారించుకోవచ్చు. కారోటినా
ఎయిడ్స్ అనేవి పచ్చటి ఆకుల్లోనూ, కూరగాయాల్లోనూ, పసుపుపచ్చ కూరగాయాల్లోనూ ఉంటాయని వీరు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో వండే సాంప్రదాయ వంటకాల్లో వీటిని చేర్చితే ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు. బీన్స్, క్యారెట్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునగ ఆకులు, మెంతి ఆకులు, అల్లం, గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, మామిడి పండ్లు తదితరవన్నీ కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేసేవే.