ఐడియా

మెరిసే పాదాల కోసం మేలైన చిట్కాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌందర్యం పట్ల ఎంత శ్రద్ధవున్న కోమలాంగులైన నిర్లక్ష్యంచేసేది నిస్సందేహంగా పాదాలనెనేమో! ఆడవాళ్ళ అందమైన నడకలో పాదాలకు ప్రాధాన్యత వుంది. హంస గమనంలో నడవడానికి చక్కని ఆరోగ్యవంతమైన కాళ్ళు ఎంతో అవసరం. కాళ్ళను ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా కాపాడుకుంటుంటే కాళ్ళనొప్పులు, పాదాలకు పగుళ్ళు లాంటి సమస్యలనుండి ఇంచక్కా దూరంగా ఉండవచ్చు. కాళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే...
పర్‌ఫెక్ట్ లెగ్స్ కోసం సాధారణమైన వ్యాయామాలతోపాటు స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్, ఫాస్ట్ వాకింగ్‌లు కూడా చేస్తే మేలు. మోకాళ్ళు, తొడల దగ్గర అనవసరంగా పేరుకుపోతున్న కొవ్వు కరిగిపోయి స్లిమ్‌గా తయారవడానికి వీలు కలుగుతుంది.
ఇంట్లోనూ, ఆఫీసులోనూ గంటల తరబడి కూర్చోకుండా మధ్యమద్యలో ఓ నాలుగు అడుగులు వేయాల్సి వుంటుంది. అలాగే ఎక్కువ సమయం నిలబడాల్సి వచ్చినపుడు నిటారుగా నిలబడి శరీర బరువును మారుస్తుండాలి. కాళ్ళకు నిర్విరామంగా పని కల్పించకుండా విశ్రాంతి కల్పించాల్సిన అవసరం వుంది.
పగుళ్ళు ఇతర సమస్యలు బాధిస్తుంటే గోరువెచ్చని నీటిలో కాసేపు పాదాలను ఉంచి బ్రష్‌తో శుభ్రపరచాలి. ఈ నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్ లేదా లావెండర్ ఆయిల్‌ని కూడా వాడుకోవచ్చు. ఇవి మృతకణాలను తొలగించడం, చెమట దుర్వాసనలను తరమడంతోపాటు యాంటి ఫంగల్‌గా పనిచేస్తాయి. మాయిశ్చరైజర్ వంటివి అప్లై చేస్తూండాలి. ఫుట్ క్రీమ్‌ను క్రమం తప్పకుండా రాస్తుండాలి.
సౌకర్యంగా, అనువుగా వుండే పాదరక్షలు మాత్రమే వాడుకోవాలి. వీటిని బట్టి నడకలో మార్పులుంటాయని గమనించాలి. కాళ్ళ అందం బయటపడాలనుకునేవారు మోడరన్ డ్రెస్సులను ఆశ్రయించాలి. డయాబెటిస్ వున్న వారైతే ఎప్పటికప్పుడు పాదాల సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సలహాలను పాటిస్తూ వుండాలి. ఇంతగా మగువ అందాన్ని ఇనుమడింపజేసే పాదాలకు ఈ పాటి మెళకువలు అవసరమే కదా మరి.

- హర్షిత