ఐడియా

మరకలు పోతాయలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైనింగ్ టేబుల్ ఎప్పుడూ కొత్తగా వుండాలనుకోవాలి. టేబుల్ చూస్తే చక్కగా దానిపై ఆహారం తినాలనిపించేటట్లు వుండాలి.
స్టాండు వేయకుండా వేడి పదార్థాలను వుంచిన గినె్నలను పెట్టకూడదు. డైనింగ్ ప్లేట్లను టేబుల్‌మీద పెట్టేటప్పుడు తప్పనిసరిగా మేట్స్‌ను ప్లేట్ల అడుగున ఉంచాలి. భోజనానికి ముందు టేబుల్‌మీద దుమ్ము, మచ్చలు, మరకలు, నీళ్ళ, పులుసు చారలు లేకుండా మెత్తటి బట్టతో శుభ్రంగా రోజూ తుడవాలి. ఆహార పదార్థాలను, ప్లేట్లను గ్లాసులను పొందికగా అమర్చాలి.
భోజనానికి అందరూ వచ్చి తినిన పిమ్మట టేబుల్‌మీదనున్న ప్లేట్లను, గ్లాసులను, గినె్నలను తీసేసి లోషన్ డ్రాప్స్‌తో చక్కగా తుడిచి వేయాలి. లేకపోతే చిన్ని చిన్ని పురుగులు, కీటకాలు వుంటాయి. వాటివల్ల ఆహార పదార్థాలు తిన్నవారికి అనారోగ్యం కలుగవచ్చు. దఫాలు వారీగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వచ్చి భోజనం చేసి వెళ్తూంటారు కావున ఆఖరిలో స్పాంజ్‌గాని, మెత్తటి గుడ్డ కాని సర్ఫ్ నీళ్ళలో తడిపి దానితో టేబుల్ తుడిస్తే టేబుల్‌పై జిడ్డు, మరకలు లేకుండా నీట్‌గా పరిశుభ్రంగా వుండి చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది.
కరెంటు పోయిన సమయంలో కొవ్వొత్తి వెలిగించి భోజనం చేసేటప్పుడు ఆ కొవ్వొత్తిని స్టాండ్ లేకుండా టేబుల్‌మీద పెట్టకూడదు. కొవ్వొత్తి నుండి కారే మైనపు చుక్కలు టేబుల్‌పై పడితే అట్ట కడుతుంది కనుక డైనింగ్ టేబుల్‌మీద ఉపయోగించే స్టాండ్స్, మేట్స్, టేబుల్‌పై వుంచకూడదు. వాటిని వేరేచోట భద్రంగా పెట్టాలి.
టేబుల్‌పై చక్కని, కంటికి ఇంపు అయిన పువ్వులున్న ఫ్లవర్‌వాజ్ వుంచితే ఆకర్షణీయగా వుంటుంది.
వాష్‌బేసిన్స్, అటాచ్డ్‌గా వున్న టాయిలెట్స్‌ను బ్లీచింగ్ పౌడర్, సగం ముగ్గుపిండితో కలుపుకుని శుభ్రంగా తోమి కడిగితే తెల్లగా, నీట్‌గా మెరుస్తాయి.
భోజనం తర్వాత బాత్‌రూములకు వెళ్ళేవారికి అనువుగా అవి నీట్‌గా వుంచాలి.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- బి.విజయలక్ష్మి