కరీంనగర్

ఐఎస్‌ఎల్ నిర్మాణాల్లో ఉద్యోగి చేతివాటం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి, జనవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐఎస్‌ఎల్ నిర్మాణాల్లో కొందరు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి చేతివాటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మచ్చతెచ్చే విధంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతిని నిర్మూలించాలని సిఎం కెసిఆర్ పదే, పదే తన ప్రసంగాల్లో విన్నవిస్తున్నప్పటికి కొందరు అధికారులు తన బుద్ధిని మాత్రం మార్చుకోవటం లేదు. ఐఎస్‌ఎల్ నిర్మాణాలకు ముగ్గు పోసి లబ్ధిదారుల వద్ద రూ.500 నుంచి 1000 వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సైతం రూ.2800, 3500 డబ్బులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చినప్పుడు సైతం ఆ ఉద్యోగి రూ.500 వరకు అక్రమంగా వసూళు చేశాడనే నిజాలు కొకొల్లలుగా మండలంలో విన్పిస్తాయి. చాలా కాలంగా ఇదే మండలంలో తిష్టవేసి ఆ ఉద్యోగి సాగిస్తున్న అక్రమ దందాలో ఆశాఖకు చెందిన అధికారులకు అందరికీ భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా సదరు ఉద్యోగిపై ఇంత వరకు ఏ అధికారి ఈవ్యవహారంపై పర్యవేక్షించిన దాఖాలాలు కన్పించవు. పలువురు మండల స్థాయి అధికారులకు, నేతలకు జీహుజూర్ అంటూ సాగిస్తున్న కార్యకలాపాలు అంత ఇంత కాదు మరి. ఆఉద్యోగి తీరుతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. గతంలో కొందరు ఫిర్యాదు చేస్తామని పలువురు నేతలు, లబ్ధిదారులు ప్రయత్నించగా వారిని బతిమిలాడుకొని కాంప్రమైజ్ అయినట్లు తెలిసింది. పలు గ్రామాల్లోని పలువురు వ్యక్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు. అక్రమ దందా కొనసాగిస్తున్న ఉద్యోగిపై అధికారులు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి విచారణ జరిగి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు.