అనంతపురం

మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శివపార్వతుల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు
అనంతపురం , మార్చి 6:మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శివాలయాలను విద్యుద్దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆయా ఆలయ కమిటీలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వాహన సేవలు, శివ పార్వతుల కల్యాణోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలోని పాతవూరు శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయం, పేట బసవేశ్వర స్వామి ఆలయం, మొదటి రోడ్డు శ్రీ కాశీ విశే్వశ్వర కోదండ రామాలయం, శ్రీ శృంగేరి శారదా శంకర మఠం, శివకోటి ఆలయం, హెచ్చెల్సీ కాలనీ మంజునాథస్వామి ఆలయం, ఆరోరోడ్డు శివాలయం, లక్ష్మీనగర్, అరవిందనగర్, సంగమేష్‌నగర్, గీతామందిర్‌లో వెలసిన శివాలయాలు శివరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆలయాలు విద్యుద్దీపాలంకరణతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. మొదటిరోడ్డు శివాలయం, పాతవూరు విరూపాక్షేశ్వర ఆలయం, మూడోరోడ్డు జిఆర్.్ఫంక్షన్ హాలులో శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హెచ్చెల్సీ కాలనీ మంజునాథ స్వామి ఆలయంలో కుబేర లక్ష్మీ సమేత ఐశ్వర్యేశ్వర విగ్రహం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 8 అడుగుల ఎతె్తైన విగ్రహానికి మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు మఠం బసవరాజుస్వామి తెలిపారు. విగ్రహాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. అదేవిధంగా నగరంలోని వివిధ ఆలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.