మహబూబ్‌నగర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు తెరాస కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* డిసిసి అధ్యక్షుడు కొత్వాల్
మహబూబ్‌నగర్, డిసెంబర్ 8: జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అదే జరిగితే తెరాస నాయకులను కోర్టుకు ఈడుస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ హెచ్చరించారు. మంగళవారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో టిఆర్‌ఎస్‌కు ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్ల సంఖ్యాబలం లేనప్పటికిని రెండు స్థానాలకు పోటీ చేయడమంటే అక్రమాలకు పాల్పడేందుకే ఇలాంటి చర్యలకు పునుకుంటున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ నాయకుల కదలికలపై ఓ కనె్నసి ఉంచామని డబ్బులు వెదజల్లడానికి చూస్తే కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ డబ్బుతోనే రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకొవాలని చూస్తున్నారని ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ప్రలోబాలకు గురి చేసి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే పోటీ చేయడం జరుగుతుందని నాగర్‌కర్నూల్‌కు చెందిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి పేరు అధిష్టానం ఖరారు చేసిందని బుధవారం ఎమ్మెల్సీ స్థానానికి నామీనేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నామీనేషన్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హజరుకావాలని మహబూబ్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. తెరాసను ఓడించే శక్తులతో కలిసి ముందుకెళ్తే జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెరాస ఒడిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని తెలిపారు. జిల్లాలో తెరాస అగడాలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో డిసిసి సీనియర్ నాయకులు ముత్యాల ప్రకాష్, రంగారావు, జూపల్లి భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, పటేల్ వెంకటేష్, బ్రహ్మయ్య, అంజయ్య, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.