కరీంనగర్

జమ్మికుంట, కమలాపూర్ పోలీసు స్టేషన్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకస్మిక తనిఖీ జమ్మికుంట/కమలాపూర్, మార్చి 26: జమ్మికుంట రూరల్, కమలాపూర్ పోలీసు స్టేషన్లను శనివారం జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును, గార్డ్ నిర్వహణను పరిశీలించారు. క్రైం రేట్ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని త్వరగా విచారణలు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్‌లు దాఖలు చేసి వేగవంతం చేయాలని సూచించారు. స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సివిల్ కేసుల్లో తలదూర్చవద్దని, పంచాయతీలు చేయవద్దని సూచించారు. ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, మహిళల ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విషయాన్ని స్టేషన్ రికార్డులో నమోదు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ ఎప్పటికప్పుడు నిర్వహించాలని, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని, గ్రామాల్లో సమాచారం ఎప్పటికప్పుడు సేకరించాలని, కొన్ని రకాల పంచాయతీలు గ్రామాల్లో హత్యల వరకు దారితీసే అవకాశం ఉన్నందున ఇలాంటివి గమనించి, గుర్తించి తగు విధంగా స్పందించాలని సూచించారు.
వీణవంక లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జులాయిగా తిరిగే వారిపై నిఘా పెంచాలని, ఈవ్‌టీజింగ్ లాంటివి అరికట్టాలని, ‘షీ’ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎక్కడ తేడా వచ్చినా శాఖా పరంగా కఠిన చర్యలుంటాయని ఎస్పీ స్థానిక అధికారులను సిబ్బందిని హెచ్చరించారు. ముఖ్యంగా జమ్మికుంటలో పెద్ద మార్కెట్‌తో పాటు రైల్వే కనెక్టివిటీ ఉన్నందున అంతరాష్ట్ర దొంగల ముఠాలు తిరిగే అవకాశం ఉన్నందున రైల్వేస్టేషన్ బస్టాండ్‌తోపాటు అన్ని ముఖ్య కూడళ్లలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతిభద్రతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు.
ఎస్పీ ఆకస్మిక తనిఖీతో స్థానిక అధికారులు టెన్షన్ పడ్డారు. ఎస్పీ వెంట స్థానిక డిఎస్పీ ఎం.రవిందర్‌రెడ్డి, సిఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.