కరీంనగర్

కమనీయం... రమణీయం ... శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 26: హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా,కన్నుల పండువగా జరిగింది.శనివారం ఉదయం 10.30గంటలకు కళ్యాణ వేడుక ప్రారంభమైంది.కళాభవన్ సమీపంలో వరుడు శ్రీ రాజరాజేశ్వరున్ని ఎదుర్కొళ్లలతో అర్చకులు కళ్యాణతంతుకు తెరలేపారు. మేళాతాళాలు,మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణమూర్తులను పల్లకిసేవలలో కళాభవన్ నుంచి ఎదుర్కొళ్ళతో అంగరంగవైభవంగా ఆలయంలోకి తీసుకువచ్చారు.కళ్యాణ వేదిక పై ఉత్సవ మూర్తులను అర్చకులు ప్రతిష్ఠించి వివాహా కార్యక్రమ పూజలను నిర్వహించారు. వివాహా శుభముహూర్తం ఘడియలు ఆసన్నం కాగానే అర్చకులు కల్యాణమూర్తుల నుదుటన ముత్యపు బాసింగాలను ధరింపజేశారు. యజుర్వేద శాస్త్రం ప్రకారం వేదపండితులు,అర్చకులు స్వామివారికి యజ్ఞోపవీత ధారణను గావించారు. 11గంటల 55నిమిషాలకు ఉత్సవమూర్తులను ఎదురేదురుగా కూర్చుండబెట్టి విగ్రహాల పై జీలకర్ర బెల్లం పెట్టి అడ్డుగా తెరను ఏర్పాటు చేశారు. కళ్యాణ ఘడియలు రాగానే అర్చకులు కళ్యాణమూర్తులకు అడ్డుగా ఉన్న తెరను తొలగించి హైందవ సంప్రదాయం ప్రకారం అభిజిల్ లగ్న సుమూహూర్తమున శాస్త్రోక్తంగా శ్రీ పార్వతీదేవికి మాంగల్యధారణ గావించి శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకళ్యాణాన్ని జరిపించారు. అనంతరం ఆలయ ఇవో రాజేశ్వర్ దంపతులు ,పురప్రముఖులు ,్భక్తులు ఉత్సవమూర్తులపై అక్షింతలు చల్లారు.ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గోపన్నగారి రాజన్న,నమిలికొండ రాజు,శరత్, నాగన్న,తమ్మల అర్చకులు వెంకన్న,ప్రసాద్,సంతోష్‌లు కళ్యాణతంతును కార్యక్రమాలను నిర్వహించారు.కన్యాదాతలుగా అర్చకులు గాలి శ్రీనివాస్ రాజేశ్వరి దంపతులు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ చైర్మన్ నామాల ఉమాలక్ష్మిరాజం,వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, పలువురు కౌన్సిలర్‌లు, వివిధ పార్టీల నేతలు తదితరులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
శోభాయమానంగా కళ్యాణవేదిక
కళ్యాణ తంతు జరిగే కళ్యాణ వేదికను గతంలో కంటే ఈసారి వివిధ రకాల పూలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.హైదవ సంప్రదాయం ఉట్టిపడే విధంగా ఆలయం లోపల అందంగా అలంకరించారు.దీంతో ఆలయానికి నూతన శోభ సంతరించుకున్నది.పూలతో అలంకరించిన కళ్యాణవేదిక అందర్ని ఆకట్టుకున్నది.
శివపార్వతుల కోలాహలం
శివకళ్యాణం సందర్భంగా ఆలయంలో శివపార్వతుల కోలాహలం నెలకొన్నది. కళ్యాణవేదిక పరిసర ప్రాంతాలు శివపార్వతులతో కిక్కిరిసాయి.కోటిలింగాల నుంచి స్వామివారి కళ్యాణాన్ని తలకించిన భక్తులతో అక్కడ రద్దీ నెలకొన్నది. శివపార్వతులు తమ వెంట తెచ్చుకున్న త్రిశూలాలకు బాసింగాలు కట్టుకొని, నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టుకొని శివుడిన తమ పెనిమిటిగా భావించి వివాహామాడారు. అనంతరం ఒక్కరిపై ఒకరు అక్షింతలు చల్లుకొని పరవశించారు.
స్వామివారి పెళ్లి కట్నం రూ 200 కోట్లు
శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం సందర్భంగా వరుడి కట్నంపై ఆలయంలో ఆసక్తికరమైన బేరసారాలు జరిగాయి. వధువు తరుపు పెద్దలుగా ఇవో రాజేశ్వర్,స్థానాచార్యులు వ్యవహరించగా వరుడి తరుపున పెళ్లి పెద్దలుగా నగర పంచాయితీ చైర్మన్ నామాల ఉమాలక్ష్మిరాజం,వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, వ్యవహరించారు. వధువుగుణగణాలను ఇవో వివరించగా ,వరుడి ధీరత్వం,సుగుణాలను వరుడి పెద్దలు వివరించారు.కట్నం బేరసారాలు నిర్వహించాక వరుడికి రూ. 200 కోట్ల కట్నం ఇవ్వడానికి వధువు తరుపున ఆలయ ఇవో రాజేశ్వర్ ఎట్టకేలకు అంగీకరించడంతో కళ్యాణం జరిగింది.
శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణానంతరం భక్తులు,శివపార్వతులు, రాజకీయ పార్టీల నాయకులు స్వామివార్లకు కానుకలను సమర్పించుకున్నారు.
భక్తుల,శివపార్వతులు, భక్తుల కట్నకానుకల ద్వారా మొత్తం మీద స్వామివారికి రూ. 67 వేలకు పైగా కట్నకానుకలు వచ్చాయి.