కరీంనగర్

కెసిఆర్ కృషితోనే పెద్దపల్లి జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, ఆగస్టు 23: ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి, సూచన మేరకే పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్సీ భానుప్రసాద రావు, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీకి పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలని, పరిపాలన సౌలభ్య కోంస కెసిఆర్ జిల్లాలను ఏర్పాటు చేశారని, చరిత్రలో పెద్దపల్లి సువర్ణక్షరాలతో లిఖించి ఉంటుందన్నారు. పెద్దపల్లిలో అన్ని వనరులు ఉన్న దృష్ట్యా జిల్లాను చేసినందుకు కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో నాయకులు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, జూపల్లి రాజేశ్వర్ రావు, బాలాజీ రావు, బుర్ర శ్రీనివాస్, కాంపెల్లి నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, తిప్పారపు దయాకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.