కరీంనగర్

ఆదర్శ పాఠశాల విద్యార్థిని అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలపల్లి, మార్చి 26: మండలంలోని ఆదర్శ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని మండలంలోని కోనరావుపేట గ్రామానికి చెందిన ఇప్పనపెల్లి పవిత్ర (15) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆదర్శ పాఠశాల హాస్టల్‌లో ఉంటు శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో పాఠశాల ఆవరణలో ఖోఖో ఆడుకుంటుండగా నీరసంగా ఉందని కూర్చుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పాఠశాల నుండి తండ్రి శంకర్‌కు సమాచారం అందించి ఆయన రాగానే కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి 108 ద్వారా తరలించి చికిత్స చేస్తుండగా రాత్రి 8:30 గంటలకు మరణించింది. కాగా, గతంలో పవిత్రకు ఏలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా చనిపోయి ఉండవచ్చని మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు ప్రకారం స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పరంధాములు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
ఆదర్శ పాఠశాలలో అనుమానస్పద స్థితిలో మరణించిన పవిత్ర కుటుంబ సభ్యులను శనివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. స్వచ్ఛంద సంస్థ నేనున్నా అధ్యక్షుడు రఘువీర్‌సింగ్ కుటుంబసభ్యులకు సహాయం అందించారు. జూలపల్లి, పెద్దాపూర్ సర్పంచ్‌లు కొంజర్ల వెంకటయ్య, పెద్దపల్లి సత్యసాగర్, జూలపల్లి ఉపసర్పంచ్ కుస్కుంట్ల రవీందర్‌రెడ్డి, నాయకులు పల్లె రాములు తదితరులు వారి వెంట ఉన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయు సంఘం రాష్ట్ర కన్వీనర్ మూల మహేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిలర్ సతీష్‌రెడ్డిలు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంకణాల జ్యోతిబసు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విదాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.