కరీంనగర్

కరీంనగర్‌లో కురిసిన వర్షం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 28: కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో సుమారు గంట పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అలాగే సిరిసిల్ల, జగిత్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. పక్షం రోజులుగా దంచికొడుతున్న ఎండలకు ఉక్కపోతతో బేజారవుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరట కలిగించింది. ఓ మోస్తారుగా వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అటు వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకున్న వివిధ రకాల పంటలకు కూడా ఈ వర్షం కాస్తంతా ప్రాణం పోసినట్లయింది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో మిణుకుమిణుకుమంటూ ఆశలు చిగురిస్తున్నాయి.