కరీంనగర్

గోపాలమిత్ర ద్వారా మంచి బ్రీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, ఆగస్టు 28: జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సభ్యులకు గోపాలమిత్ర ద్వారా మంచి బ్రీడ్ డెవలప్‌మెంట్ కోసం పశువులకు కృత్రిమ గర్భదారణ చేయిస్తున్నట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, కరీంనగర్ డెయిరీ చైర్మన్ సిహెచ్ రాజేశ్వర్ రావు అన్నారు. మండలంలోని నుస్తులాపూర్‌లోని కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాల ఉత్పత్తిదారుల కేంద్రంలో ఆదివారం ‘ఆమ్ ఆద్మీ బీమా యోజన’, విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ఉత్పత్తిదారుల పిల్లలకు అధికంగా మార్కులు వచ్చిన విద్యార్థులకు 337 మందికి గాను రూ.2,69,600 లు పంపిణీ చేశారు. ఇందులో 988 మార్కులు సాధించిన అఖిలకు ఐదు వేలు, 981 మార్కులు సాధించిన విజయ్‌చందర్ రెడ్డికి స్కాలర్‌షిప్‌లు అందజేశారు. అలాగే ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద సహజంగా మరణించిన వారికి 50 వేల చొప్పున, ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ప్రస్తుతం జిల్లా నుంచి 15 వేల లీటర్ల పాలను హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడ్వయిజర్ హన్మంత రెడ్డి, పాలకేంద్రం చైర్మన్ వంగల శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, లింగారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.