కరీంనగర్

నీటి తొట్టిలో పడి ఇద్దరు బాలుర మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, ఆగస్టు 28: మండలంలోని తంగళ్లపల్లిలో లంకెల శివ (3) అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి ఆదివారం మృతి చెందాడు. బ్రతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్న లంకెల వెంకటేశం-పద్మలు గ్రామ దేవతల మొక్కులు చెల్లించుకునేందుకు గాను శనివారం స్వగ్రామమైన తంగళ్లపల్లికి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. ఆదివారం మొక్కులు చెల్లించుకొనే కార్యక్రమంలో ఉండగా వీరి మూడేళ్ల బాలుడు శివ ఆడుకుంటూ తొట్టిలో పడి మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో వెతకగా నీటితొట్టిలో శవమై కనిపించడంతో బోరున విలపించారు. ఈ సంఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులను కలచివేసింది.
నీటి గుంతలో పడి బాలుడి మృతి
ముకరంపుర (కరీంనగర్): కరీంనగర్ మండలం చింతకుంట, ఎలగందుల పాత రోడ్డులో ఎస్సారెస్సీ కాలువ కోసం తవ్విన నీటి గుంతలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని బాలుడు (12) మృతిచెంది కన్పించాడు. ఈ సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ఈత కోసం దిగి మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మార్చురీలో భద్రపరిచారు. మృతుడికి సంబంధించిన వారు సమాచారం అందించాలని రూరల్ సిఐ కృష్ణగౌడ్ కోరారు.