కరీంనగర్

అన్యాయం జరిగినచోటే ప్రతిఘటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోయినిపల్లి, ఆగస్టు 28: ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే ప్రతిఘటన ప్రారంభమవుతుందని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ విమలక్క అన్నారు. ఆదివారం బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో పోరాటాల రాజవ్వ సంస్మరణ సభ చెన్నమనేని పురుషోత్తం రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విమలక్క మాట్లాడుతూ 1978కి ముందు నుండి అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా రాజవ్వ జనశక్తి కార్యకర్తగా కొదురుపాక చిట్యాల రాజవ్వ పనిచేస్తూ పెత్తనం కోసం సాగుతున్న పోరాటంలో వ్యతిరేకంగా తిరగబడిందన్నారు. దొరల పెత్తనాన్ని ప్రశ్నించినందుకు వారి గుండాల చేత అత్యాచారం చేయించి రాజవ్వను హింసించిన ధైర్యంతో పోరాటం చేసిందన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కెరియర్ కోసం యువత ప్రాకులాడుతూ పిరికితనంతో బ్రతుకున్నారన్నారు. యువత ప్రశ్నించేతత్వం అలవర్చుకొని పిరికితనం దరిదాపుల్లోకి రానివ్వద్దని ఆమె పిలుపునిచ్చారు. ఈసందర్భంగా పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ రాజవ్వ పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అరుణోదయ కళాకారుల సంఘం కన్వీనర్ దూడ లచ్చన్న, పిఓడబ్ల్యూ స్ర్తి విముక్తి నాయకురాలు రాజేశ్వరి, పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సాయి, శ్రామిక శక్తి బీడి కార్మిక నాయకురాలు జి.రుక్మిణి, నీలోజిపల్లి సర్పంచ్ కూస రవీందర్, కొడుముంజ సర్పంచ్ పెద్ది నవీన్, అంబేద్కర్ సంఘాల నాయకులు కత్తెరపాక రవీందర్, చెన్నమనేని పురుషోత్తం రావు తదితరులు పాల్గొన్నారు.