కరీంనగర్

జగిత్యాలలో నకిలీ ఇళ్ల ప్రొసిడింగ్‌ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 28: ఇళ్ల పట్టాలకు సంబంధించి నకిలీ ప్రొసిడింగ్‌లతో పట్టాలు విక్రయించడం జగిత్యాలలో కలకలం రేపుతోంది. నిరుపేదలకు మంజూరైన ఇళ్ల పట్టాలనే నకిలీ ప్రొసిడింగ్‌లను తయారు చేసి విక్రయించడం స్థానికంగా చర్చనీయంగా మారింది. ఇదివరకు పని చేసిన గృహ నిర్మాణ శాఖ అధికారే సూత్రదారిగా అనుమానిస్తున్నారు. మల్యాల మండలం నూకపల్లి గృహ నిర్మాణ కాలనీలో నిరుపేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలనే మధ్య దళారులు సదరు అధికారి సహకారంతో ఈవ్యవహరాన్ని నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాలనీలో జగిత్యాల పట్టణానికి చెందిన దాదాపు వెయ్యి మంది నిరుపేదలకు గత ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పట్టాలు పంపిణీ చేసింది. అయితే ఇంటి నిర్మాణం కోసం రుణం సైతం మంజూరు చేసినప్పటికి కొంతమంది నిరుపేదలు బేస్‌మెట్ లెవెల్ వరకు పూర్తి చేసి రుణం మంజూరు కాకపోవడంతో అర్ధంతరంగా వదిలిపెట్టారు. దాంతో చాలాకాలం పాటు నిరుపయోగంగా ఉన్న ఇళ్ల స్థలాలపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు దృష్టి కేంద్రీకరించి నిరుపేదలకు మంజూరైన పట్టాదార్ల వివరాలను గోప్యంగా సేకరించి కొనుగోలు చేసే వ్యక్తి పేరుతో నకిలీ పట్టా ప్రొసిడింగ్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు సబ్ కలెక్టర్ దృష్టికి వచ్చింది. ఈక్రమంలోనే అసలు లబ్ధిదారులు, మధ్య దళారుల పట్టా ప్రొసిడింగ్ పత్రాలు, రికార్డులను పరిశీలించగా, కొంతమంది రికార్డులు సక్రమంగా ఉన్నప్పటికి కొన్నింటిలో నకిలీ ప్రొసిడింగ్‌లతో పట్టాలు విక్రయించినట్లు గుర్తించారు. కాగా జగిత్యాల సబ్ కలెక్టర్ నేతృత్వంలో ప్రస్తుత డిఇ రాజేశ్వర్, జగిత్యాల, మల్యాల తహశీల్దార్లచే నకిలీ ప్రొసిడింగ్‌లపై విచారణ జరుగుతోంది. ఇందులో ఎవరి ప్రమేయం ఎంత అనే కోణంలో విచారిస్తున్నారు. అనంతరం విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందచేయనున్నట్లు సమాచారం.