కరీంనగర్

న్యాయమైన పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 28: కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట తమ భూములకు తక్కువ పరిహారం చెల్లించి భూములు తీసుకుంటానంటే సరికాదని.. న్యాయమైన పరిహారం చెల్లిస్తూ.. భూములు కోల్పోయిన వారందరికి ప్రాజెక్ట్‌లో ఉపాధి అవకాశం కల్పిస్తానంటేనే తమ భూములిస్తామని గోలివాడ రైతులు తెగేసి చెప్పారు. ఆదివారం రామగుండం మండలం గోలివాడలో భూసేకరణపై అభిప్రాయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీఓ అశోక్‌కుమార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్‌ఇ సుధాకర్ రెడ్డి, తహశీల్దార్ గుడూరి శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం పంప్ హౌస్ నిర్మాణం కోసం సేకరించే భూమి వ్యవహారంలో ఎలాంటి గోప్యం లేదని, రైతులకు అన్యాయం చేయాలని తమ లక్ష్యం కాదని, అంతా పారదర్శకంగానే జరుగుతోందని వివరించారు. గ్రామంలో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఎకరాన 2లక్షలుండగా దానికి మూడింతలుగా ప్రభుత్వం చెల్లించనుందని, మీకు ఏ ధర నిర్ణయం అనుకుంటారో.. అది తెలియజేయాలని ఆర్డీఓ కోరారు. దీంతో రైతులు మాట్లాడుతూ మా గ్రామంలో 16 లక్షలకు పైచిలుకు ఎకరాన ధర పలికే భూములున్నాయని, అలాగే వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా ఉందని స్పష్టం చేశారు. సరైన పరిహారం చెల్లింపులు జరిగితేనే భూములిస్తాం.. లేదంటే ఇవ్వలేమని మరోమారు రైతులు స్పష్టం చేశారు. తాము భూములు ఇవ్వాలంటే ఉద్యోగంతోపాటు డబుల్ బెడ్ రూం ఇళ్లు, గ్రామంలోని మిగతా భూములకు సాగునీరు, ప్రతీ ఇంటికి గోదావరి నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ 14 డిమాండ్లతో కూడిన నోటీసును అధికారులకు రైతులు అందజేశారు. ఈ సమావేశంలో ఎంపిపి రాజేశం, జడ్పీటిసి సంధ్యారాణి, గ్రామ సర్పంచ్ రమ్య, ఎంపిటిసితోపాటు పలువురు నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.