కరీంనగర్

సిద్దిపేటలో కలుపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, ఆగస్టు 28: నూతనంగా ఏర్పాటు చేసే సిద్దిపేట జిల్లాలో కోహెడ మండలాన్ని చేర్చవద్దంటూ మండలంలోని వరికోలుకు చెందిన రైతు జాప మల్లారెడ్డి గ్రామ చావడి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. నూతనంగా ఏర్పాటు చేసే సిద్దిపేట జిల్లాలో మండలాన్ని కలుపొద్దని ఆందోళనలు చేస్తున్నా స్పందన రాకపోవడంతో తానీ దీక్షకు పూనుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం దీక్షను ప్రారంభించిన ఆదివారం వెలుగులోకి రావడంతో మండలంలోని టిఆర్‌ఎస్ మినహా వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజాప్రతినిధులు గ్రామం చేరుకొని మల్లారెడ్డికి సంఘీభావం ప్రకటించారు. స్థానిక పిహెచ్‌సి నుండి ఇద్దరు ఎఎన్‌ఎంలు, పోలీసులు దీక్షా శిబిరం చేరుకున్నారు. ఆయనకు ఎఎన్‌ఎంలు వైద్యపరీక్షలు నిర్వహించి బిపి లెవల్ కొద్దిగా పడిపోయాయని తెలిపారు. మండలం కరీంనగర్ జిల్లాకు అతి సమీపంలో ఉందని, పైగా తమ వరుకోలు గ్రామం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండగా ప్రస్తుతం ఏర్పాటయ్యే సిద్దిపేట జిల్లాకు 60 కిలోమీటర్లకు పైగా దూరభారం పెరుగుతుందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తన ఆమరణ నిరాహారదీక్ష వల్లనైనా ప్రభుత్వం స్పందించి మండలాన్ని వేరు చేయకుండా చర్యలు చేపట్టాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మండల బిజెపి అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం, టిడిపి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సంఘీభావం ప్రకటిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మండలాల విలీనం పట్ల పునరాలోచించాలని డిమాండ్ చేశారు.