కరీంనగర్

సికాస పేరుతో వసూళ్ల దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 30: గోదావరిఖనిలో చాప కింద నీరులా కొనసాగుతున్న వసూళ్ల దందా బయట పడింది. మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) పేరుతో బెదిరింపులకు తెగబడుతూ లక్షలాది రూపాయలు వసూళ్లు చేసిన నకిలీ ముఠా పట్టుబడింది. వసూళ్ల దందా వ్యవహారంలో మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన దాసరి రాములు అలియాస్ శ్రీకాంత్, గోదావరిఖనికి చెందిన భూమేష్, పిల్లి సంపత్‌ను అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని సబ్ డివిజనల్ ఎఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎఎస్పీ విష్ణు వారియర్ అరెస్టు వివరాలను వెల్లడించారు. గోదావరిఖనికి చెందిన బానయ్య అనే ఆర్‌ఎంపి డాక్టర్‌ను మావోయిస్టు సికాస పేరుతో 10లక్షలు దాసరి రాములు, భూమేష్ డిమాండ్ చేయగా అతని నుంచి 3లక్షలు ఒకసారి, 2లక్షలు ఒకసారి వసూళ్లు చేశారు. అదేవిధంగా గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన భూవివాదం సెటిల్‌మెంట్ చేస్తానని దాసరి రాములు, పిల్లి సంపత్ కలిసి సదరు వ్యక్తి నుంచి 50వేలు వసూళ్లు చేశారు. ఆర్‌ఎంపి డాక్టర్‌ను బెదిరించి వసూళ్లు చేసిన కేసులో మంచర్ల శ్రీనివాస్ పరారీలో ఉండగా భూ వివాదం వ్యవహారంలో వసూళ్లు చేసిన కేసులో సిలివేరి మల్లయ్య పరారీలో ఉన్నట్లు ఎఎస్పీ తెలిపారు. వీరి నుంచి రూ.4,37,500 తోపాటు రెండు నకిలీ తుపాకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దాసరి రాములు అజ్ఞాతం వీడిన తరువాత నుంచి అనేక బెదిరింపులకు పాల్పడ్డట్లు తెలుస్తుందని, గతంలో సికాసలో పనిచేసిన తరుణంలో అతనిపై 62 కేసులకు పైగా నమోదు అయిన్నట్లు ఎఎస్పీ వెల్లడించారు. వన్‌టౌన్ సిఐ ఆరె వెంకటేశ్వర్, రామగుండం సిఐ వాసుదేవరావు, సంయుక్త నేతృత్వంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. విచారించడంతో పూర్తి బండారం బయట పడింది. ఈ వసూళ్ల దందా వ్యవహారం కేసులో రామగుండం సిఐ వాసుదేవ రావు వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరును ఎ ఎస్పీ ప్రశంసించారు. ఈ సమావేశంలో సిఐలు ఆరె వెంకటేశ్వర్, వాసుదేవ రావు, ఎస్‌ఐలు చిప్ప రాజవౌళి గౌడ్, మహేందర్, కానిస్టేబుల్లు బాయి శ్రీను, ప్రభాకర్ రావు, ఎలియా, రహీం, రామన్న పాల్గొన్నారు.