కరీంనగర్

అలా అనడం సర్కార్‌కు అలవాటైపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 27: మంచి జ రిగితే ప్రభుత్వ గొప్పతనం, నష్టం జరిగితే గత పాలకుల అసర్ధత వల్లే అనడం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అలవాటై పోయిందని మాజీ ఎంపి, టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ము ఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తికి ఉ ండే విచక్షణ అధికారాలను వినియోగించి ఇచ్చిన హామీలను నెరవేర్చేందు కు ప్రయత్నాలు చేయాలేతప్ప ఇలా బహిరంగంగా క్షమాపణలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్‌మానేర్ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పి ఏడాది తర్వాత చేతులెత్తయడం సరికాదన్నారు. రెండు నెలల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కరివేద మండల కేంద్రంలో ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో అక్కడి నిర్వాసితులకు కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారని, ఏడాది, ఏడాదిన్నర తర్వాత వారికి కూడా క్షమాపణ చెప్పి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. 2014 నవంబర్‌లో మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్‌లు మిడ్‌మానేర్ ప్రాజెక్టు వద్ద ఉరుకులు పరుగులు పెట్టిస్తానని చెప్పిన మాట ఎందుకు అమలు కాలేదని విమర్శించారు. ప్రాజెక్టుకు కుడివైపుకు ఒకరు, ఎడమ వైపు ఇంకొకరని నియమించింది ఎవరో తెలువదా అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే టెండర్లు ఫైనల్ చేసి పనులు ప్రారంభించారని అన్నారు. మిడ్‌మానేర్‌తోపాటు ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి కట్ట తెగిన మిడ్‌మానేర్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా ? సిద్ధమైతే లెక్కా పక్కాలతో రావాలని ప్రభుత్వానికి, మంత్రులకు సవాల్ విసిరారు. సిఎం కెసిఆర్ భేషజాలకుపోకుండా మిడ్‌మానేర్ నిర్వాసితులందరికి మాట ఇచ్చిన ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.