కరీంనగర్

హోటల్‌పైకి దూసుకెళ్లిన బస్సు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, సెప్టెంబర్ 27: సుల్తానాబాద్ ఆర్టీసి బస్టాండ్ వద్ద మంగళవారం ఘోరప్రమాదం తప్పింది. కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపుకు లారీ వెళ్తుంది. పెద్దపల్లి నుండి సుల్తానాబాద్‌కు బస్సు వస్తుంది. బస్సు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు వస్తుండగా భారీ వాహనంగల లారీ అతను గమనించి ఒక్కసారిగా బస్టాండ్‌లోకి లారీని పో నిచ్చాడు. దీంతో ఆర్టీసి బస్సు పక్కనే ఉన్న సాయిశ్రీ హోటల్‌పైకి దూసుకెళ్లింది. హోటల్ ముందు వేసిన రేకులు బస్సులోకి పోవడంతో అద్దాలు ధ్వసంమయ్యాయి. లారీ-బస్సు ఢీకొంటే పె ద్దఎత్తున ప్రాణనష్టంతోపాటు ఎంతో మంది క్షతగాత్రులైఉండేవారు. బ స్సులో ఉండే ప్రయాణీకులు భయం భయంగా ఒక్కసారిగా కిందికి దిగి దేవుడా తమ ప్రాణాలు రక్షించావంటూ ఊపిరిపీల్చుకున్నారు. బస్సు కిందికి హోటల్‌కు సంబంధించిన గ్యాస్ సిలిండర్ వెళ్లి లీకవడంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా భయబ్రాంతులకు గురయ్యా రు. బస్సు పక్కనే వంటలు చేసే పొయ్యిలు మండుతున్నాయి. ఇది గమనించిన హోటల్ వారు బస్సు కిందికి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ను తీసి ఆఫ్ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. హోటల్‌కు సంబంధించిన రేకులు ధ్వంసం కావడంతో పాటు పది వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని హోటల్ వారు తెలిపారు. మొత్తం మీద ఘోర ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణీకులు, బస్టాండ్ పక్కనే ఉన్న ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.