కరీంనగర్

పందిరి సేద్యానికి సబ్సిడీ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, మార్చి 31: పందిరి సేద్యానికి సహకార సంఘం ద్వారా సబ్సిడీ రుణాలు అందచేయనున్నట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గురువారం గంభీరావుపేట సహకార వ్యవసాయ సహకార సంఘ మహజన సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా రైతులనుద్ధేశించి మాట్లాడుతూ పందిరి సేద్యం రైతులకు లాభదాయకంగా వున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క రైతు పందిరి సేద్యంపై దృష్టి కేంద్రికరించాలని ఆసక్తిగల రైతులకు సహకారం సంఘం ద్వారా సబ్సిడి రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా వున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని మంథనిలో రైతులు చేస్తున్న పందిరి సేద్యాన్ని ఆయన ఉదహరించారు. రైతుల లాభసాటికి సహకార సంఘం తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు సకాలంలో చెల్లించినట్లయితే ఆరు శాతం రిబెట్ ఇస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్క రైతు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని కోరారు. పాల ఉత్పత్తుల సహకార సంఘంలో లక్ష లీటర్లున్న పాల ఉత్పత్తి నేడు లక్షా90వేలకు పెరిగిందన్నారు. పాడిపరిశ్రమకు, గోర్రెల పెంపకానికి సహకార బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఎంత మంది వచ్చిన అంత మందికి రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యం నిల్వవుంచడానికి గోదాంలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క రైతు సహకరించిన నాడే సహకార సంఘాలు అభివృద్ధిబాటలో నడుస్తాయని అందుకు ప్రతి ఒక్కరు సహకరించి సంఘాల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. మండల పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో పిడుగుపాటుకు మృతి చెందిన నారాయణరెడ్డి రైతు కుటుంబానికి రూ. లక్ష చెక్కును ఛైర్మన్ ఈ సందర్భంగా అందచేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో ఉపాధ్యక్షడు లక్కిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సెస్ డైరెక్టర్ కొక్కు దేవెందర్‌యాదవ్, టిఆర్‌ఎస్ నాయకులు మల్లుగారి నర్సాగౌడ్, కమ్మరి రాజరాం, సింగిల్ విండో కార్యదర్శి సత్యంరావులతో పాటు డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.