కరీంనగర్

ప్రజల భాగస్వామ్యంతోనే ... శాంతిభద్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, అక్టోబర్ 22: ప్రజల రక్షణ కోసమే పోలీసుశాఖ పని చేస్తుందని... ప్రజల భాగస్వామ్యంతోనే శాంతిభద్రతలు పరిరక్షణ సాధ్యమవుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ అన్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో నేరాల అదుపుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించామని చెప్పారు. శనివారం ఎన్టీపీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న పోలీస్ కమీషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ సుదీర్ఘంగా మాట్లాడారు. రామగుండం కమీషనరేట్ పరిధిలో అక్రమ దందాలు, భూ మాఫియాలు, అసాంఘిక శక్తుల ఆగడాలను సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నామని, సిసి ఎస్ పర్యవేక్షణలో సైబర్ క్రైంపై నిఘా పెంచుతూ డిస్ట్రిక్ లీగల్ సెల్ సర్వీస్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కమీషనరేట్ పరిధిలో మావోయిస్టు కదలికలు పూర్తిగా తగ్గిపోయాయని, జనమైత్రిలో భాగంగా ప్రజలకు మరింత దగ్గరలో పోలీసు సేవలు ఉంటాయని అన్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని, అది అధికారి అయినా... పోలీసు అధికారులయినా... వదిలి పెట్టే సమస్యే లేదని తేల్చి చెప్పారు. మహిళలపై జరుగుతున్న అఘాయితాల్యను, ఈవ్‌టీజింగ్‌లను అరికట్టేందుకు మహిళా కానిస్టేబుల్స్ ను పెడుతూ ప్రత్యేక ‘షీ టీం’లను ఏ ర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్స్, కాలేజీలు, దేవాలయాలపై నిఘా పె ంచుతున్నామని, అక్రమ లిక్కర్ దం దా, బెల్ట్ షాపుల నిర్వహణ, గుడుంబా అమ్మకాలు పూర్తిగా అరికడుతామని చెప్పారు. సోషల్ మీడియా మాధ్యమాలను వినియోగించుకుంటూ ఫేస్ బుక్, వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు మరింత చేరువవుతామని, దీనితోపాటు కమీషనరేట్ ఫరిధిలో యూ ట్యూబ్ ఛానల్ ద్వారా సమస్యలను తెలుసుకోవడంతోపాటు పరిష్కరిస్తామని అన్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫిర్యాదు దారులకు ఎదురవుతున్న దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ప్రతీ ఊరిలో పిటిషన్ మేళా నిర్వహించనున్నామని, స్థానిక సమస్యల పరిష్కారం కోసమే జనమైత్రి పోలీస్ పని చేస్తుందని దుగ్గల్ వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంజనీరింగ్, ఆర్టీసీ, హెల్త్, ఆర్ అండ్ బి అన్ని విభాగాలను కలుపుకొని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంచిర్యాల, పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, రామగుండంలో మహి ళా పోలీస్ స్టేషన్, పెద్దపల్లి, జైపూర్ పి ఎస్‌లను అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేశామని, హైదరాబా ద్ కమీషనరేట్ తరహాలో ఇక్కడ కూ డా పోలీసు యంత్రాంగం పని చేస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల డిసిపిలు విజేందర్ రెడ్డి, జాన్ వెస్లీ, ఎసిపిలు మల్లారెడ్డి, రమణారెడ్డితోపాటు సిఐలు వాసుదేవరావు, వెంకట రమణ, వెంకటేశ్వర్, చల్లా దేవారెడ్డి, చిలుకూరి వెంకటేశ్వర్లు, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నేడు కానిస్టేబుళ్ల రాతపరీక్ష
* 8,537 మంది అభ్యర్థులు * మొత్తం 17 పరీక్ష కేంద్రాలు
* నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ * కేంద్రాల వద్ద 144 నిషేధాజ్ఞలు
* నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, అక్టోబర్ 22: పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికలో కీలక ఘట్టమైన తుది రాత పరీక్ష మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు (సివిల్/ఎఆర్/ టిఎస్‌ఎస్‌పి/ఎస్‌పిఎఫ్/ ఎస్‌ఎఆర్‌సిపిఎల్/ఎస్‌ఎఫ్‌ఓ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ప్రిలిమినరీ రాతపరీక్ష ఆదివారం జరగనుంది. 8,537 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, వీరికోసం జిల్లా కేంద్రంలో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ నగరంలోని వాగేశ్వరి, అపూర్వ, వాణినికేతన్, శ్రీ చైతన్య, ఎస్‌ఆర్‌ఎం, వివేకానంద డిగ్రీ కాలేజీలతోపాటు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్సారార్ డిగ్రీ కళాశాల, ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశా ల, సహజ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉ దయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 నిషేదాజ్ఞలు అమలు కానుండగా, పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లు మూసివేయాలని పోలీసులు నిర్వాహకులకు సూచించారు. శనివారం పోలీసు కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి పరీక్షా కేం ద్రాలను సందర్శించి పరిశీలించారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, అభ్యర్థులు బ్లాక్/బ్లూ పాయింట్ పెన్, ఒరిజనల్ హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. కమీషనర్ వెంట ఎసిపి రామారావు, ఇన్‌స్పెక్టర్లు సదానందం, కృష్ణగౌడ్, మహేష్‌గౌడ్‌లతోపాటు పలువురు ఉన్నారు. మొత్తానికి మరికొన్ని గంటల్లో అభ్యర్థుల తల రాతను మార్చే పరీక్ష ప్రారంభం కానుండగా, పరీక్ష నిర్వహణకు పోలీస్‌శాఖ అంతా సిద్ధం చేసింది.

బంగారు తెలంగాణ కోసం ...
అందరూ భాగస్వాములు కావాలి
* తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
ఇల్లంతకుంట, అక్టోబర్ 22: బంగారు తెలంగాణ సాధన కోసం గ్రామాల అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని రేపాక, సోమారంపేట, దాచారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధన లక్ష్యం దిశగా సిఎం కెసిఆర్ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నారన్నారు.

పంట ఉత్పత్తులకు క్వింటాలుకు రూ. 100 బోనస్ ప్రకటించాలి
* జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి

జగిత్యాలరూరల్, అక్టోబర్ 22: రైతులు సాగు చేసే వివిధ పంట ఉత్పత్తులకు కేద్ర ప్రభుత్వం అందించే మద్దతు ధరతోపాటు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 100 అదనంగా బో నస్ అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యా ర్డులో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే మొక్కజొన్న కేంద్రాన్ని ఎఎంసి చైర్మన్ శీలం ప్రియాంకతో కలసి ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డి కొనుగోళ్లను ప్రారంబించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు సీజన్లుగా రైతుల పరిస్థితి దుర్బరంగా మారిందని, తీవ్ర అనావృష్టితో వేసిన పంటలు చేతికి రాక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గత ఖరీప్‌లో సీజన్ ముగిసిన తర్వాత ఆశించిన మేర వర్షపాతం నమోదు అయినప్పటికీ రైతులు ఆశించిన పంట దిగుబడు లు పొందలేకపోయారన్నారు. రైతులు తొందరపడి మద్యదళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేద్రాలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఇదివరకే గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైన దృష్యా ఆయా గ్రామాల్లోని ఐకేపి కేంద్రాలను సత్వరమే ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం ముందుచూపుతో రైతులకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా రైతాంగానికి అండగా ఉండాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎంపిపి గర్వందుల మానస, డిసిఎంస్ చైర్మన్ గోలి సురేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బిసి కమిషన్ చైర్మన్‌గా రాములు
* జగిత్యాల జిల్లాకు దక్కిన చైర్మన్ పదవి
జగిత్యాల, అక్టోబర్ 22: బీసి కమీషన్ చై ర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం బిఎస్ రాములును నియమించడంతో జగిత్యాల జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్ర భుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన బీసి కమిషన్‌కు తొలి చైర్మన్‌గా జగిత్యాలకు చెం దిన సామాజిక తత్వవేత్త, చేనేత కుటుంబానికి చెందిన బేతి శ్రీరాములును నియమించడం పట్ల బలహీన వార్గల్లో హర్షం వెల్లువెత్తుంది. సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్‌గా పని చేస్తునే అప్పటి పీపుల్స్‌వార్‌కు అకర్షితుడై ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఒత్తిళ్లతో కొంతకాలం తరువాత లొంగిపోయిన బేతి శ్రీరాములు ప్రభుత్వం తిరిగి వార్డెన్‌గా నియమించగా, కొద్దికాలంపాటు వార్డెన్‌గా పనిచేసారు. అనంతరం స్వచ్చంద పదవి విరమణ చేసి రచనలపై దృష్టిసారించారు. శ్రీరాములు అనేక విశే్లషన రచనలు చేసారు. శ్రీరాములు నియమాకం పట్ల తెలంగాణ బీసి సంక్షేమ ఐక్య కార్యచరన సమితి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వ నియమించిన చైర్మన్ హోదాలో రాములు 3 ఏళ్లపాటు కొనసాగనున్నారు. చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది.

చెదలు పట్టిన ఫైళ్లు ఇచ్చారంటూ సర్పంచ్ ఆగ్రహం
సుల్తానాబాద్, అక్టోబర్ 22: సుల్తానాబాద్ మేజర్ గ్రామపంచాయతీ రాజీవ్ షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన ఫైళ్లను గత మే నెలలో అధికారులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారని, తిరిగి విచారణ అనంతరం పంచాయతీకి అప్పగి ంచిన ఫైళ్లు పూర్తిస్థాయిలో చెదలుపట్టి అక్కరకు రాకుండా ఉన్నాయని సర్పం చ్ అంతటి అన్నయ్యగౌడ్ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్‌గా కమల
* టిఆర్‌ఎస్ సంబరాలు... బాణాసంచా కాల్చివేత
సుల్తానాబాద్, అక్టోబర్ 22: సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తిప్పారపు కమల నియామకంపట్ల శనివారం రాత్రి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నాయకులు పెద్దఎత్తున సంబరాలు నిర్వహించా రు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు. వైస్‌చైర్మన్‌గా పూసాల గ్రామానికి చెందిన కోట రంగారెడ్డితోపాటు డైరెక్టర్లను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఈ సంబరాలలో మండల ఎంపిటీసీల ఫోరం అధ్యక్షుడు సూర శ్యాం, ఎంపిటిసి మైలారం నారాయణ, తిప్పారపు ధయాకర్, పసెట్ల రవీందర్, బుర్ర శ్రీనివాస్, అరుణ్, శివ, వాసు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ దాడులు... గుడుంబా స్వాధీనం
సుల్తానాబాద్, అక్టోబర్ 22: సుల్తానాబాద్ ఎక్సైజ్ పరిధిలోని సుల్తానాబా ద్, కాల్వశ్రీరాంపూర్ మండలాలలో శనివారం పలుచోట్ల దాడులు నిర్వహిం చి, గుడుంబా స్వాధీనపర్చుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయేందర్ తెలిపారు. దాడుల్లో కానిస్టేబుళ్లు సతీష్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
రహదారిని అభివృద్ధి చేయాలి
సుల్తానాబాద్, అక్టోబర్ 22: సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు రోడ్డు నుం డి పాతజెండా, శివాలయం మీదుగా రోడ్డు విస్తరణలో భాగంగా ఎవరి ఇంటికి నష్టం జరుగకుండా ఉండేందుకుగాను ఉన్న రోడ్డునే అభివృద్ది చేయాలని పలువురు పేద గృహాలవాసులు సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్‌కు వినతిపత్ర ం సమర్పించారు. శనివారం స్థానిక వైశ్యభవన్‌లో రోడ్డు విస్తరణ కోసం ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకుగాను సమావేశం నిర్వహించారు. ఇందులో ప లువురు గృహవాసులు మాట్లాడుతూ ఒక ప్రణాళికతో ఉన్న ఇండ్లకు ఎలాంటి నష్టం జరుగకుండా రోడ్డు, డ్రైనేజీలు అభివృద్ది చేయాలన్నారు. సర్పంచ్ అ న్నయ్య మాట్లాడుతూ అందరి నిర్ణయం మేరకే అభివృద్దికి పంచాయతీ పాలకవర్గం ముందుకువెళ్లడం జరుగుతుందన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
* రామగిరి తహశీల్దార్ ఉమాశంకర్
సెంటినరికాలనీ, అక్టోబర్ 22: పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రామగిరి మండల తహశీల్దార్ ఎ.ఉమాశంకర్ అన్నారు. శనివారం సెంటినరి కాలనీలోని రామగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో అమరవీరుల వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలలో విజేతలుగా నిల్చిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ప్రతి విషయంలో పోటీతత్వం ఉంటే విజేతలుగా నిల్వడం ఖాయమన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి ప్రతిఒక్కరు తెల్సుకోవాల్సిన భాద్యత ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు పల్లె ప్రతిమ-పివిరావు, మొల్మూరి శ్రీనివాస్, ఆశా, కోలిపాక లక్ష్మిసత్తయ్య, కానిస్టేబుళ్లు విజయ్,రాజేందర్, దేవయ్య, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ కొనుగోళ్లు చేస్తే చర్యలు
హుస్నాబాద్, అక్టోబర్ 22: పట్టణంలో బహిరంగ కొనుగోళ్లు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వెంకటేశ్యర్లు హెచ్చరించారు. శనివారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటిని సందర్శించి ధాన్యం కొనుగోళ్లను, ధాన్యం నాణ్యతను, రైతులకు మా ర్కెట్‌లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోళ్ల కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని, దళారులను అశ్రయించవద్దని సూచించారు. ప్రభు త్వం మేలు రకం ధాన్యానికి రూ. 1560, మధ్యరకం రూ. 1460 ధర నిర్ణయించినట్లు తెలిపారు.
పాడి పరిశ్రమకు వివిధ రకాల రుణాలు
చొప్పదండి, అక్టోబర్ 22: గత ఉమ్మడి ప్రభుత్వంలో కేవలం పాడి పరిశ్రమ కు అవకావం చిత్తూరు జిల్లాలోనే ఉండేదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడట ంతో కొత్తగా ఈ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి సహాకార సంఘంను ఎంపిక చేయటం జరిగిందని నాబార్డ్ డిడిఎం రవిబాబు తెలిపారు. శనివారం సంఘ ఆవరణలో రైతులతో సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు. పా డిపరిశ్రమలో భాగంగా సోలార్‌కు, అంతరపంటలకు, గొర్రెలె పెంపకంకు, గో బర్‌గ్యాస్ ఉత్పత్తికి రూపాయి వడ్డీతో రుణాలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. చొప్పదండి సంఘ పరిధిలో 150 మంది రైతులను ఎంపిక చేయటం జరిగిందని, వారికి రూ. 1లక్ష నుంచి రూ. 1.50లక్షల వరకు రూపాయి వడ్డీకి అందివ్వటం జరుగుతుందని తెలిపారు.