కరీంనగర్

నగదురహితపై అవగాహన ర్యాలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, డిసెంబర్ 3: గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాలలో శనివారం నగదు రహితపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మండల పరిధిలోని కొత్తపల్లి, నర్మాల, దమ్మన్నపేట తదితర గ్రామాలలో నగదు రహితపై ఆ యా గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ నాగపురి నాగరాజుగౌడ్ మాట్లాడుతూ నల్లధనం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 500, 1000 నోట్ల రద్దు అనంతరం 18 సంవత్సరాలు నిండిన ప్ర తిఒక్కరు బ్యాంక్ ఖాతా కల్గివుండాలని, నూరుశాతం బ్యాంక్ ఖాతాలే లక్ష్యంగా గ్రామంలోని ప్రతిఒక్కరూ ఖాతా తెరవాలని సూచించారు. ప్రతిఒక్కరు బ్యాంక్ ఖాతా కల్గివుండి మొబైల్ బ్యాంక్ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. నగదు లావాదేవీలు వద్దు, బ్యాంక్ లావాదేవీలు ముద్దని ని నాదాలు చేశారు. నగదు రహితపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాలలో నిర్వహించిన నగదురహిత ర్యాలీలలో సర్పంచ్‌లు, పంచాయతీ కా ర్యదర్శులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అవినీతి రహిత నిర్మూలనపై ర్యాలీ
గంభీరావుపేట, డిసెంబర్ 3: అవినీతిరహిత నిర్మూలనపై శనివారం గంభీరావుపేట మండల కేంద్రంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జిల్లాపరిషత్ బాలుర పాఠశాల నుండి మొ దలైన ర్యాలీ స్థానిక అమరవీరుల స్థూపం వరకు కొనసాగింది. అవినీతిని నిర్మూలిద్దామంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వృద్ధుల సంక్షేమం కోసం కృషిచేస్తాం
చందుర్తి, డిసెంబర్ 3: వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక కృషిచేస్తానని రుద్ర ంగి ఎఎంసీ చైర్మన్ దప్పుల అశోక్ అన్నారు. మల్యాలలో చార్వాక వృద్ధుల నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన వృద్దులకు నెలనెల అసరా పెన్షన్ అందించేందుకు కృషిచేస్తామన్నారు. రుద్రంగిలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో భవన నిర్మాణానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, గణేష్, కమలాకర్, రాంచంద్రయ్య, వెంకట్‌రెడ్డి, అశోక్‌రావు, రాములు, గౌరయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్లధనాన్ని వెలికితీయడం కోసమే పెద్దనోట్ల రద్దు
* బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్
చందుర్తి, డిసెంబర్ 3: దేశంలో ధనికులవద్దఉన్న నల్లధనాన్ని వెలికితీయడం కోసం కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుచేసిందని, దీంతో రానున్నరోజుల్లో సామాన్యులకే లాభం చేకూరుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. రుద్రంగిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ంలో చాలామందివద్ద నల్లధనం పేరుకుపోయిందని, దానిని వెలికితీసేందుకే ప్ర ధాని నరేంద్రమోది సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రజలు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం వాస్తవమేనని, కొద్దిరోజుల్లో సమస్యలు తొలిగిపోతాయన్నారు. నల్లధనాన్ని నిర్మూలిస్తున్న ప్రధానిని ప్రపంచదేశాలు, పలు రాష్ట్రాలు అభినందిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్, మండలాధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్, ఎంపీటీసీలు పావని, చిన్నరాజవ్వ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి, దావాల గంగాధ ర్, వెంకట్‌రెడ్డి, గంగనర్సయ్య, అభిలాష్ తదితరులు పాల్గోన్నారు.
అవినీతి నిర్మూలనకు కృషిచేయాలి
* తహశీల్దార్ అంబటి రజిత
సుల్తానాబాద్, డిసెంబర్ 3: అవినీతి నిర్మూలనకు ఉద్యోగులందరూ కృషిచేయాలని తహ శీల్దార్ అంబటి రజిత, ఎంపిడి ఓ వినోద్‌లు అన్నారు. శనివార ం అవినీతి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో, ఎ ంపిడివో కార్యాలయంలో ఉ ద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేశా రు. కార్యక్రమంలో డిప్యూటి తాహశీల్దార్ సురేష్, ఆర్‌ఐ షఫియోద్దిన్, విఆర్‌వో లు వరలక్ష్మీ, రజని, వెంకటేశ్వర్‌రావు, క్రిష్ట, సిబ్బంది పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 3: దేశం లో అన్ని రాష్ట్రాలలోకంటే తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్థా నిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అ న్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో దివ్యాంగుల దినోత సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వివిధ రంగాల లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువు రు దివ్యాంగులకు జ్ఞాపికలు అ ందిం చి సత్కరించారు. స్థానిక భవిత కే ంద్రంలో నిర్వహించిన కార్యక్రమ ంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రత్యేక అ వసరాలుగల పిల్లలకు ఆయన మె మొంటోలు అందజేశారు.మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ అంగవైకల్యం కలిగినవారికి రూ. 1500 పించన్ ఇస్తున్న విషయాన్ని గు ర్తుచేశారు. అలాగే ప్రభుత్వశాఖలో ప నిచేస్తున్నవారికి అదనంగా వేతనం ఇ వ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తె లిపారు. అన్నిరంగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కోన్నారు. అంగవైకల్యం కలవారు మానసికంగా కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముం దుకు వెళ్లాలన్నారు. ఇందుకు ప్రభుత్వ ం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వికలాంగులు, బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలకోసం ప్రభుత్వం భవిత కేంద్రా లు ఏర్పాటు చేసిందని, అందులోకి వచ్చే పిల్లలకు విద్య నేర్పడంతోపాటు అవసరమైన పరికరాలు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే అవసరమైనవారికి శస్తచ్రికిత్సలు కూడా చేయిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగులపట్ల అందరూ స్నేహభావ ంతో ఉండాలని, వారికి తగిన సాయం అందించి వెన్నుదన్నుగా నిలువాలనా నరు. కార్యక్రమంలో స్థానిక జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కందుకూరి అంజ య్య, ఎంపిపి సందనవేన సునీత, జ డ్పీటీసీ యాట దివ్యారెడ్డి, ఎంపిడివో బాలే మల్లేశం, ఐకెపి, ఇజిఎస్ సిబ్బ ంది, దివ్యాంగులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ పటిష్టానికి కృషిచేయాలి
గోదావరిఖని, డిసెంబర్ 3: తెలంగా ణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్తూ డివిజన్ స్థాయిలో టిఆర్‌ఎస్ పార్టీ పటిష్టానికి కృషిచేయాలని నాయకుల కు, కార్యకర్తలకు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం గౌతమీనగర్‌లో టిఆర్‌ఎస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు దీటి బాలరాజు అధ్యక్షతన కార్పొరేష న్ కమిటీ, కార్పొరేషన్ అనుబంధ సం ఘాల అధ్యక్ష, కార్యదర్శులు, డివిజన్ అధ్యక్షుల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయ న మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కెసిఆర్ నాయకత్వం లో రెండున్నర సంవత్సరాల కాలంలో మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీ లే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాల ను ప్రవేశపెట్టి విజయవంతంగా అ మలు చేస్తుందన్నారు. ప్రతీ వారం రెం డు డివిజన్‌లలో డివిజన్ కమిటీ, అనుబంధ సంఘాల కార్యకర్తల సమావేశం నిర్వహించాలని, ఆ సమావేశాలకు కా ర్పొరేషన్ కమిటీ నాయకులు, అనుబ ంధ సంఘాల నాయకులు, తాను హా జరవుతానని తెలిపారు. సమావేశంలో టిఆర్‌ఎస్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి చల్లగురుగుల మొగిలి, నాయకు లు ఉల్లంఘుల రమేష్, ఎండి.అక్రం, కుసుమ స్వరూప, గడ్డి కనకయ్య, అ నుబంధ సంఘాల అధ్యక్షులు జాలి రాజమణి, మంచికట్ల బిక్షపతి, ఎంఎ. హమీద్, ఎండి.ప్యారేమియా, ములుగూరి వీరయ్య, బొల్లెన శ్రీ్ధర్, మెట్టు వినేష్, అనుబంధ సంఘాల ప్రధాన కార్యదర్శులు, 50 డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం 9 మంది లబ్ధిదారులకు మంజూరైన సిఎం రిలీఫ్ ఫ ండ్ చెక్కులను అందజేశారు. ఆయన సమక్షంలో ఐఎన్‌టియుసికి చెందిన తోట చిన్నయ్య, కందుల సత్తయ్య, కొ లిపాక సమ్మయ్యతోపాటు 20 మంది పర్మినెంట్ కార్మికులు పార్టీలో చేరగా వారికి కండువాలుకప్పిఆహ్వానించారు.

భారత్ ప్రతిష్టను దిగజార్చిన మోదీ
జగిత్యాల టౌన్, డిసెంబర్ 3:కరెన్సీ రద్దు చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్టను ప్రధానమంత్రి నరేంద్రమోది దిగజార్చడని సిఎల్‌పి ఉపనేత జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఎజెండాలో బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నల్ల కుబేరుల జాబితాను బయట పెడుతానని, ప్రతి పేదవాడి ఖాతలో 15లక్షల రూపాయలు వేస్తామని అధికారంలోకి వచ్చాక మోది అంబాని, అదాని వంటి కుబేరులను ప్రక్కన పెట్టుకున్నాడని ఆరోపించారు. అంబాని అక్రమంగా 11 వేల కోట్ల చమురు నిల్వలను సంపాధించాడన్నారు. ఇప్పటివరకు బ్యాంకుల్లో 10 లక్షల కోట్లు డిపాజిట్ లు కాగా, సిఆర్‌ఆర్ గ్రాంట్ క్రింద బ్యాంకులు 4శాతం ఆర్‌బిఐలో డిపాజిట్ చేయాలని, మిగిలిన కేవలం లక్ష కోట్లకే సామాన్యులను రోడ్డు ఎక్కించి ఇబ్బంది పెడుతున్నారని అరోపించారు. మోది కొండను తవ్విన ఎలుక ను పట్టలేకపోయాడని, నగదు రహిత లావాదేవిలతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, ప్రజలందరికి ఖాతాలు కావాలి, వీటితోపాటు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇప్పించాలని అన్నారు. 130 కోట్ల జనాభాకు కేవలం 5శాతం స్వైపింగ్ వాడుతున్నారని దేశంలో 2.2 లక్షల ఎటిఎంలు ఉంటే ప్రస్తుతం 35 వేల ఎటిఎంలే పనిచేస్తున్నాయని, ఎస్‌బిహెచ్ ఎటిఎంలు మూడురోజుల నుండి పనిచేయటంలేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వేతో వెయ్యికోట్ల నష్టం జరిగిందన్నారు. బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి కరెన్సీ రద్దు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని పేర్కొనడం ప్రభుత్వం గమనించాలని, అర్థికవేత్త, అర్థశాస్త్ర నోబుల్ బహుమతి అవార్డు గ్రహిత అమర్త్య్‌సేన్ ఆలోచనలను ప్రభుత్వం పరిగణంలోకి తీసుకోవాలని అన్నారు. తెలంగాణకు 5వేల కోట్లు తెచ్చి వెనువెంటనే వినియోగంలోకి తీసుకు వచ్చి కరెన్సీ కొరతను తీర్చాలని బాధ్యత సిఎం కెసిఆర్‌కు ఉం దన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు బండశంకర్, ఎంపిపి గర్వందుల మానస, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గంగం మహేష్, పూర్ణచందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నగదురహిత
లావాదేవీలకే ప్రాధాన్యతనివ్వండి
* క్యాష్ లెస్‌లో కరీంనగర్‌ను ముందు నిలపాలి
* జిల్లాకు వచ్చిన రూ. 80 కోట్లు
* వీర సైనికుల సేవలు చిరస్మరణీయం
* పతాక దినోత్సవానికి విరాళాలివ్వండి
* జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, డిసెంబర్ 4: పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఇబ్బందులను తొలగించేందుకుగాను అందరు నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల్లో సిద్దిపేట జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారని, అందరు క్యాష్ లెస్ లావాదేవీలు కొనసాగించి కరీంనగర్ జిల్లాను ముందు వరుసలో నిలుపాలని కోరారు. జిల్లాకు రూ.80కోట్లు వచ్చాయని, ఎస్‌బిఐ, ఎబిహెచ్, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకులకు చేరాయని తెలిపారు. ఎటిఎం కేంద్రాల ద్వారా రూ.500నోట్, బ్యాంకుల్లో విత్‌డ్రాల ద్వారా రూ.2వేల నోట్ ఇస్తారని వివరించారు. జిల్లాలో 2లక్షల 58వేల కుటుంబాలుంటే, లక్షా 70వేల మందికి బ్యాంకు ఖాతాలున్నాయని, ఇందులో 35శాతం ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారని, 2లక్షల 47వేల మంది ఉపాధి కార్మికులుంటే, అందరికి ఖాతాలున్నాయని, 61వేల మంది విద్యార్థులకు ఖాతాలున్నాయని వివరించారు. జిల్లాలో 10శాతం మాత్రమే ఖాతాలు లేవని, ఖాతాలు లేనివారు ఖాతాలు తీసుకోవాలని కోరారు. సోమవారం నుంచి గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇకపోతే దేశ సరిహద్దు ప్రాంతాల్లో దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీర సైనికుల సేవలు అభినందనీయమని, చిరస్మరణీయమని కొనియాడారు. వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ చేయూత నివ్వాలని అన్నారు. సైనిక దళాల పతాక నిధికి విరాళాలు అందజేయాలని, ఈ విరాళాలకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుందని అన్నారు. ఈ నెల 7న జరిగే పతాక దినోత్సవంలో జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విరాళాలు ధారాళంగా ఇవ్వాలని, జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలు విరాళాలు అందించి విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.సమావేశంలో ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి ప్రవీణ్‌కుమార్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.