కరీంనగర్

మట్కా బుకీల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 10: గత కొంతకాలంగా కరీంనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా మట్కాను నిర్వహిస్తున్న ఇద్దరు బూకీలను కమీషనరేట్ ప్రత్యేక విభాగం పోలీసులు శనివారం పట్టుకున్నారు. కరీంనగర్ నగరంలోని ఖార్కానగడ్డకు చెందిన నహీమొద్దిన్ అలియాస్ జావిద్ (42), కరీంనగర్ మ ండలం చింతకుంటకు చెందిన పొలంపల్లి రాజు (46) అనే ఇద్దరు బూకీలను అరెస్ట్‌చేసి, వీరినుంచి 2సెల్‌ఫోన్లు, 29,940 నగదు, మట్కా చిట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమీషనర్ కమలాసన్‌రెడ్డి బూకీల వివరాల ను వెల్లడించారు. నహీమొద్దిన్ అలియాస్ జావిద్, పొలంపల్లి రాజులు గ త కొంతకాలంగా ముంబాయి కేం ద్రంగా నడుస్తున్న మట్కాను చిరు వ్యా పారులు, దినసరి కూలీలు, కడుబీద కుటుంబాలకు చెందిన వారిని ప్రలోభపెట్టి కొనసాగిస్తున్నారు. మట్కా ద ందాతో చాలామంది నష్టపోతున్నారని అందిన సమాచారం మేరకు కమీషనరేట్ పరిధిలో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిఘాను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే అందిన పక్క సమాచారంతో పోలీసు బృందం శనివారం దాడులు జరిపి ఆ ఇద్దరు బూకీలను అరెస్ట్ చేశారు. వీరి చేతిలో చిక్కుకున్న చాలామంది కూలీలు, చి రు వ్యాపారులు, కడుబీద కుటుంబాల కు చెందినవారు పెట్టుబడులు పెడు తూ నష్టపోతున్నారని కమీషనర్ తెలిపారు. మట్కా రోజుకు రెండుసార్లు జరుగుతుందని, సెల్‌ఫోన్ల ఆధారంగా కొనసాగుతుండటంతో పోలీసులకు చిక్కకుండా నిర్వహిస్తున్నట్లుతెలిపారు. ఈమధ్యకాలంలో వాట్సాఫ్ మేసేజ్‌ల ద్వారా కూడా మట్కాను నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. తమ బృందం జరిపిన దాడుల్లో మట్కా నిర్వహకులకు సంబంధించి మరింత సమాచారం లభించిందని, మరికొంతమంది బూకీలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు కొనసాగిస్తుందని కమీషనర్ తెలిపారు. మట్కా బాధితులతో కూడా కమీషనర్ మాట్లాడించారు.సమావేశంలో అడిషనల్ సిపి అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.