కరీంనగర్

క్రీడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 15: ఉమ్మడి రాష్ట్రంలోక్రీడల నిర్వహణ కూడా చేపట్టకుండా సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ క్రీడాకారులు ఎం తో ఉజ్వల భవిష్యత్‌ను కోల్పోయారని, స్వయం పాలనకోసం ఆవిర్భవించిన కొత్తరాష్ట్రంలో క్రీడల అభివృద్దికోసం ప్రభుత్వం ప్రత్యేక కృషిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు అన్నారు. గత నాలుగురోజులుగా నగరంలోని అల్పోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కొత్తపల్లిలోకొనసాగుతున్న జాతీ య ఫెన్సింగ్ పోటీల ముగింపు సమావేశానికి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ఆదినుంచి అనేక ఉద్యమాలకు పుట్టినిల్లైన కరీంనగరంలో గత కొన్నాళ్ళుగా అనేక స్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని, క్రీడలపట్ల ఆసక్తికూడా ఇదేస్థాయిలో జిల్లాలో ఉందన్నారు. ఆటలు శారీరక దృఢత్వంతో పాటు మనిషిలో చురుకుదనాన్ని పెం చుతాయని, అలాగే తమ ప్రాంత,జిల్లా,రాష్ట్ర,దేశ పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపింపజేస్తాయన్నారు. నచ్చిన క్రీడను ఎంచుకుని ముందుకు సాగుతున్న క్రీడాకారులను ప్రభుత్వం వెన్నంటి ప్రోత్సహిస్తోందని, ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారిణి సానియామీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు లాంటివారిని సముచితంగా గౌరవించటమే ఇందుకు నిదర్శనమన్నారు. జాతీయ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 17 ఫెన్సింగ్ పోటీల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యాభారతి బాలుర విభాగంలో మొదటిస్థానంలో నిలవ గా, పంజాబ్ రెండోస్థానంలో, చంఢీఘర్ మూడోస్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో హర్యానా మొదటిస్థానంలో, చంఢీఘర్, పంజాబ్‌లు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ప్రజాప్రతినిధులు, క్రీడాప్రాధికార సంస్థ అధికారులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా గోదాదేవి కల్యాణం
సుల్తానాబాద్, జనవరి 15: మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో పవిత్ర ధనుర్మాసంలోని చివరి ఘట్టమైన గోదారంగనాయక స్వాముల కల్యాణం వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కల్యాణోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం అనంతరం గోదారంగనాథులను ఎత్తుకొని నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారులు సౌమిత్రి వెంకటాచార్యులు, వేణుమాధవ్, శ్రావణ్ కుమార్, ప్రసాద్‌లు కల్యాణ వేడుకలను జరిపారు. ఇందులో వికాస తరంగిణి సభ్యులు సాదుల భాస్కర్, సాధుల సుగుణాకర్, లెక్కల నగేష్, సిరిపురం రమేష్, కొమురవెల్లి లింగమూర్తి, పల్ల కిషన్, ఒల్లాల రాజు, పలువురు పెద్దఎత్తున పాల్గొన్నారు.