కరీంనగర్

ప్రణాళికతోనే ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 15: విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 14నుంచి ప్రారంభం కానున్నాయి. బాహ్యప్రపంచంలోకి అడుగిడేందుకు అవకాశం కలిగించే సమయం మరో56రోజులు మాత్రమే మిగి లి ఉండగా, ఈవిలువైన కాలాన్ని తమకు విజయసోపానాలుగా మార్చుకునేందుకు మరికొంతసేపుకష్టిస్తూ, పక్కా ప్రణాళికతోముందుకేగితే, ఉత్తీర్ణత సాధించటం పెద్ద సమస్యేమి కాకపోవచ్చు. అత్యధిక మార్కులు పొందాలంటే సరైన మెళుకువలతో పాటు, పాఠ్యపుస్తకాలు క్రమపద్దతిలో చదివాల్సిందేనని ఉపాధ్యాయులు స్పష్టంచేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులతో పాటు పంతుళ్ళు కూడా గత కొద్దిరోజులుగా శ్రమిస్తున్నారు. ఎప్పటిమాదిరిగానే వంద రోజుల ప్రణాళిక రూపొందించి, నిత్యం ఉదయం, సాయం వేళ ల్లో ప్రత్యేక తరగతులు బోధిస్తూ, విద్యార్థుల సందేహాలుతీర్చటంలోమునిగితేలుతుండగా, కార్పోరేట్‌కు ధీటుగా ఫలితాలు సాధిస్తామనే ఆశ అధికారుల్లోనెలకొంది. జిల్లావ్యాప్తంగా 15,329 మంది విద్యార్థులు వార్షికపరీక్షలకు సన్నద్దమవుతున్నారు. వీరిలో 7,900మంది బాలురు, 7,429 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 8.30గంటలనుంచి 9.30 గంటలవరకు, సాయంత్రం 4.45గంటలనుంచి 6గం టలవరకు పాఠ్యాంశాల బోధకులు రోజుకో సబ్జెక్టు చొప్పున బోధిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పునఃబోధన కూడా పూర్తికాగా, అత్యధిక పాఠశాలల్లో మూడోసారి కొనసాగుతున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేక తరగతుల బోధన అనంతరం గత కొనే్నళ్ళుగా ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న ఉత్తీర్ణత నేపథ్యంలో పంతుళ్ళు కొత్త ఉత్సాహంతోకార్పోరేట్ పాఠశాలల ఉత్తీర్ణతకు ధీటు గా ఫలితాలు సాధించేలా పక్కావ్యూహంతో బోధన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ప్రతిభాశక్తిని పరిగణలోకి తీసుకుని నాలుగు గ్రూపులుగా విభజించి, బోధన చేపడుతున్నారు. తరగతిలో మొదటి 10 స్థానాల్లో ఉన్న వారిని ఏగ్రూపులో, 11నుంచి 20 స్థానాల్లో ఉన్న వారిని బి గ్రూపులో,21నుంచి 30 స్థానాల్లో ఉన్న వారిని సి గ్రూపులో, 31నుంచి 40 స్థానాల్లో ఉన్న వారిని డి గ్రూపులోచేర్చి బోధన నిర్వహిస్తున్నారు. మొదటి రెండు గ్రూపుల్లోని విద్యార్థులకు తాము బోధించిన అంశాలపై బృంద చర్చలు ఏర్పాటుచేస్తూ, అనుమానాలు వస్తే ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. సి,డి గ్రూపులకు మాత్రం విద్యార్థులు బలహీనంగా ఉన్న సబ్జెక్టుల్లోని పాఠాలపై అవగాహన కల్పిస్తూ, ముఖ్యమైన అంశాలపై పదే పదే బోధిస్తుండటం గమనార్హం. కార్పోరేట్ మాదిరి చదువులో వెనుకంజలో ఉండే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ,వారిని వార్షిక పరీక్షలకు సన్నద్దం చేస్తున్నారు. సిసిఈ విద్యావిధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో10జిపిఏ సాధించేలా సమాయత్తపరుస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక తరగతులపై దృష్టిసారించి, గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ఆత్మవిశ్వాసం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది.

రాజన్నను దర్శించుకున్న
దేవాదాయ కమిషనర్
శ్రీ రాజరాజేశ్వరస్వామిని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ శివశంకర్ శనివా రం స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నా రు. వారు ఆలయంలోకి రాగానే ఇవో రాజేశ్వర్, అర్చకులు ఆయనకు ఎదురేగి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.గర్భాలయంలో కొలువుదీరిన శ్రీలక్ష్మి సహిత గణపతిస్వామివారికి,శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించగా ఆలయ ఇవో రాజేశ్వర్ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు.
పది గ్రాములు బంగారం బహుకరణ
శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి పదిగ్రాములతో తయారు చేయించిన బంగారు ముక్కు పుడకలను శనివారం నిత్యాన్నదాన సత్రం చైర్మన్ కొండ దేవయ్య ఆలయ అధికారులకు అప్పగించారు.