కరీంనగర్

ముగిసిన భోగభాగ్యాల సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 15: ఇంటి వాకిళ్లల్లో విరిసిన రంగవల్లులు..వాటి నడుమ ముచ్చటగొలిపే గొబ్బెమ్మలు... ఘమఘమలాడిన పిండి వంటకాలు.. ఆకాశానా పంతగుల రెపరెపలు...హరిదాసు కీర్తనలు.. డూడూ బసవన్నల విన్యాసాలు...బోగిపండ్లు... బొమ్మల కొలువులు... ఇలా మూడు రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజలు సంక్రాంతి సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం బోగిమంటలు, రెండవ రోజు శనివారం సంక్రాంతి, మూడవ రోజు ఆదివారం కనుమ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి, జమ్మికుంట, పెద్దపల్లి, మంధని, గోదావరిఖని, సుల్తానాబాద్, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, ఏల్లారెడ్డిపేట తదితర పట్టణాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సం క్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు ఉదయానే్న ఇంటి వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు పెట్టి, వాటిపై గరకపోసలు, వాటి చుట్టు నవధాన్యాలు, రేగుపండ్లు పోసి అందంగా అలకరించి రంగవల్లులు ముచ్చటగొలిపాయి. అనంతరం ఇళ్లల్లో పసందైన పిండి వంటకాలు చేసుకుని ఇంటిల్లిపాది కలిసి భోజనాలు చేశారు. రేగుపండ్లు, నవధాన్యాలతో తయారుచేసిన బోగిపండ్లను చిన్నారులపై పోసి పెద్దలు దీవించారు. గ్రామాల్లో డూడూ బసవన్నల విన్యాసాలు హరిదాసు కీర్తనలు అలరించగా, బొమ్మల కొలువులు ఆకట్టుకున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఆకాశాన పంతగులను ఏగురవేస్తూ ఆనందంతో తేలియాడారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలు వారివారి ఇలవేల్పులైన ఆలయాలకు వెళ్లి దైవదర్శనాలు చేసుకున్నారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మొత్తానికి బోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు కనుమరోజు ఎడ్ల పందాలతో వేడుకలు ముగియగా, ఈ మూడు రోజులు ప్రజలు సంబరాల్లో మునిగితేలారు.

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడరూరల్,జనవరి 15: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజనంతో శనివారం రద్దీ నెలకొంది. కుటుంబ సభ్యులతో పెద్ద భక్తు లు ఇక్కడి చేరుకున్నారు.స్వామివారిని 20వేల మంది భక్తులు దర్శించుకోని తరించారు.తెలంగాణ ప్రాంతం నుంచి భక్తులు వేములవాడకు చేరుకున్నారు. ధర్మగుండంలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి ధర్మదర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లలో బారులు తీరారు.కోడె మొక్కు లు, అభిషేకాలు,కుంకుమపూజలు చేసుకొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. అర్జిత సేవలు,ప్రసాదాలు,కోడె మొక్కుల టికెట్ల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.5లక్షల ఆదా యం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.